Tuesday, June 21, 2016

క్షీరసాగరమథనం – వననిధి జలముల

కూర్మావతారము
8-201-క.
నిధి జలముల లోపల
మునిఁగెడి గిరిఁ జూచి దుఃఖమునఁ జింతాబ్దిన్
మునిఁగెడి వేల్పులఁ గనుఁగొని
జాక్షుఁడు వార్ధినడుమ వారలు చూడన్.
టీకా:
            వననిధి = సముద్రము {వననిధి - వనము (నీటి)కి నిధి, సముద్రము}; జలము = నీటి; లోపలన్ = అందు; మునిగెడి = మునిగిపోతున్న; గిరిన్ = కొండను; చూచి = చూసి; దుఃఖమునన్ = శోకముతో; చింత = శోకమనెడి; అబ్దిన్ = సముద్రమువ; మునిగెడి = మునిగిపోతున్న; వేల్పులన్ = దేవతలను; కనుగొని = చూసు; వనజాక్షుడు = హరి; వార్ధిన్ = సముద్రపు; నడుమన్ = మధ్యలో; వారలు = వారు; చూడన్ = చూచుచుండగ.
భావము:
            దేవతలు అందరూ అలా ములిగిపోతున్న మందరపర్వతాన్ని చూస్తూ అంతులేని దుఃఖసాగరంలో మునిగిపోతుంటే చూసిన విష్ణుదేవుడు, వారు చూస్తుండగానే సముద్రం మధ్య లోకి దిగాడు.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: