Wednesday, May 4, 2016

ప్రహ్లాదుడు స్తుతించుట – దంష్ట్రివై తొల్లి

7-376-సీ.
దంష్ట్రివై తొల్లి సోరుని హిరణ్యాక్షునీవు చంపుటఁ జేసి నిగ్రహమున
మా తండ్రి రోషనిర్మగ్నుఁడై సర్వలో; కేశ్వరుఁ బరము ని న్నెఱుఁగ లేక
రిపంథి పగిది నీ క్తుండ నగు నాకుపకారములు జేసె తఁడు నేఁడు
నీ శాంతదృష్టిచే నిర్మలత్వము నొందెఁగావున బాప సంఘంబువలనఁ
7-376.1-తే.
బాసి శుద్ధాత్మకుఁడు గాఁగ వ్యగాత్ర!రము వేఁడెద నా కిమ్ము నజనేత్ర! 
క్తసంఘాత ముఖపద్మ ద్మమిత్ర!క్త కల్మషవల్లికా టు లవిత్ర!"
టీకా:
          దంష్ట్రివి = వరాహాతారుడవు {దంష్ట్రి - దంష్ట్రములు (కోరపళ్ళు) గలది వరాహము యొక్క రూపము ధరించినవాడు, వరహావతారుడు, విష్ణువు}; ఐ = అయ్యి; తొల్లి = పూర్వము; సోదరునిన్ = సహోదరుని; హిరణ్యాక్షున్ = హిరణ్యాక్షుని; నీవు = నీవు; చంపుటన్ = సంహరించుట; చేసి = వలన; నిగ్రహమున = తిరస్కారముతో; మా = మా యొక్క; తండ్రి = తండ్రి; రోష = కోపమునందు; నిర్మగ్నుడు = పూర్తిగా మునిగినవాడు; ఐ = అయ్యి; సర్వలోకేశ్వరున్ = హరిని {సర్వలోకేశ్వరుడు - సమస్తమైన లోకములకు ప్రభువు, విష్ణువు}; పరమున్ = హరిని {పరము - పరాత్పరుడు, సర్వాతీతుడు, విష్ణువు}; నిన్నున్ = నిన్ను; ఎఱుగన్ = తెలియ; లేక = లేకపోవుటచే; పరిపంథి = శత్రువు {పరిపంథి - పరి (ఎదుటి) పంథి (పక్షమువాడు), శత్రువు}; పగిదిన్ = వలె; నీ = నీ; భక్తుండను = భక్తుడను; అగు = అయిన; నా = నా; కున్ = కు; అపకారములు = కీడు; చేసెన్ = చేసెను; అతడు = అతడు; నేడు = ఈ దినమున; నీ = నీ యొక్క; శాంత = శాంతింపజేసెడి; దృష్టి = చూపల; చేన్ = వలన; నిర్మలత్వమున్ = పవిత్రతను; ఒందెన్ = పొందెను; కావున = కనుక; పాప = పాపముల; సంఘంబు = సమూహముల; వలనన్ = నుండి; పాసి = వీడినవాడై
          శుద్ద = స్వచ్ఛమైన; ఆత్మకుండు = ఆత్మకలవాడు; కాగన్ = అగునట్లు; భవ్యగాత్ర = నరసింహ {భవ్యగాత్రుడు - దివ్యమంగళమైన గాత్ర (దేహముగలవాడు), విష్ణువు}; వరమున్ = వరమును; వేడెదన్ = కోరెదను; నా = నా; కున్ = కు; ఇమ్ము = ఇమ్ము; వనజనేత్ర = నరసింహ {వనజనేత్రుడు - వనజ (పద్మము) వంటి నేత్ర (కన్నులుగలవాడు), విష్ణువు}; భక్తసంఘాతముఖపద్మపద్మమిత్ర = నరసింహ {భక్తసంఘాతముఖపద్మపద్మమిత్ర - భక్త (భక్తుల) సంఘాత (సమూహముల) యొక్క ముఖములు యనెడి పద్మ (కమలములకు) పద్మమిత్ర (సూర్యుని వంటివాడ), విష్ణువు}; భక్తకల్మషవల్లికాపటులవిత్ర = నరసింహ {భక్తకల్మషవల్లికాపటులవిత్రుడు - భక్త (భక్తుల యొక్క) కల్మష (పాపములు) యనెడి వల్లికా (లతలకు) పటు (గట్టి) లవిత్ర (కొడవలివంటివాడు), విష్ణువు}.
భావము:
            “ఓ పద్మాక్షా! నారసింహా! నీవు భక్తుల ముఖాలనే పద్మాలకు పద్మముల మిత్రుడైన సూర్యుని వంటివాడవు. భక్తుల పాపాలు అనే లతల పాలిట లతలను తెగగోసే కొడవలి వంటివాడవు. తన తమ్ముడు హిరణ్యాక్షుడిని, పూర్వకారలంలో నీవు వరాహరూపంలో వచ్చి, సంహరించావని మా తండ్రి హిరణ్యకశిపుడు నీపై ద్వేషం, రోషం పెట్టుకున్నాడు. సర్వేశ్వరుడవైన నిన్ను గుర్తించలేకపోయాడు. నిన్ను బద్ధవిరోధిగా భావించాడు. నేను నీ భక్తుడను అయ్యానని కోపంతో నన్ను నానా బాధలూ పెట్టాడు. అటువంటి నా తండ్రి ఈవాళ నీ శాంత దృష్టి సోకి నిర్మలుడు అయ్యాడు. అందువల్ల ఆయన పాపాలు పోయి పరిశుద్ధాత్ముడు అయ్యేలా వరం ప్రసాదించు.”
७-३७६-सी.
दंष्ट्रिवै तोल्लि सोदरुनि हिरण्याक्षु; नीवु चंपुटँ जेसि निग्रहमुन
मा तंड्रि रोषनिर्मग्नुँडै सर्वलो; केश्वरुँ बरमु नि न्नेर्रुँग लेक
परिपंथि पगिदि नी भक्तुंड नगु नाकु; नपकारमुलु जेसे नतँडु नेँडु
नी शांतदृष्टिचे निर्मलत्वमु नोंदेँ; गावुन बाप संघंबुवलनँ
७-३७६.१-त.
बासि शुद्धात्मकुँडु गाँग भव्यगात्र!; वरमु वेँडेद ना किम्मु वनजनेत्र!
भक्तसंघात मुखपद्म पद्ममित्र!; भक्त कल्मषवल्लिका पटु लवित्र!"
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

3 comments:

Badri said...

I thank YOU very much for such a great Blog for Telugu People. No words are close enough to praise your deeds.

vsrao5- said...
This comment has been removed by the author.
vsrao5- said...

బద్రి గారికి నమస్కారములు
ఆదరాభిమానాలతో మీరు చూపిన స్పందన, మన బ్లాగు, జాలగూడు (వెబ్ సైట్) మరింత బాగా ఉండేలా తీర్చిదిద్దడంలో ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ధన్యవాదములు
క్రింది లింకు చూడగలరు.
బద్రి గారి స్పందన