Monday, May 30, 2016

క్షీరసాగరమథనం - పట్టులేక

8-167-మత్త.
ట్టులేక బహుప్రకార విన్న చిత్తులమైతి; మే
మెట్టకేలకు నిన్నుఁ గంటి మభీప్సితార్థము వచ్చుఁ; బె
న్వెట్టయైన దవానలంబున వేఁగు నేనుఁగు మొత్తముల్
నిట్టవేర్చిన గంగలోపల నీరు గాంచిన చాడ్పునన్.
టీకా:
            పట్టు = ఆధారము; లేక = లేకపోవుటచేత; బహు = అనేక; ప్రకార = విధములుగ; విపన్న = బాధచెందుతున్న; చిత్తులము = మనసుగలవారము; ఐతిమి = అయిపోతిమి; మేమున్ = మేము; ఎట్టకేలకున్ = చిట్టచివరకు; నిన్నున్ = నిన్ను; కంటిమి = దర్శించితిమి; అభీప్సితార్థము = కోరికలు; వచ్చున్ = తీరును; పెన్ = మిక్కిలి; వెట్ట = వేడిమిగలది; ఐన = అయినట్టి; దవానలంబునన్ = దావానలమునందు; వేగున్ = తపించిపోతున్న; ఏనుగు = ఏనుగుల; మొత్తముల్ = సమూహములు; నిట్టవేర్చిన = ఉప్పొంగుతున్న; గంగ = గంగానది; లోపల = అందలి; నీరున్ = నీటిని; కాంచిన = చూచిన; చాడ్పునన్ = విధముగా.
భావము:
            మేము దిక్కులేని వారము అయ్యాము. అనేకరకాల కష్టాలతో కలత చెందిన మనసులు కలవారము అయి బాధపడుతున్నాము. కార్చిచ్చు యొక్క మిక్కిలి అయిన వేడిమి ధాటికి తపించిన ఏనుగుల మంద ఉప్పొంగుతున్న గంగలోని నీళ్ళు కనుగొన్న విధంగా, చిట్టచివరికి నిన్ను దర్శించ గలిగాము. ఇక మా కోరికలు నెరవేరి తీరుతాయి.
८-१६७-मत्त.
पट्टुलेक बहुप्रकार विपन्न चित्तुलमैति; मे
मेट्टकेलकु निन्नुँ गंटि मभीप्सितार्थमु वच्चुँ; बे
न्वेट्टयैन दवानलंबुन वेँगु नेनुँगु मोत्तमुल्
निट्टवेर्चिन गंगलोपल नीरु गांचिन चाड्पुनन्.
 : :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: