Friday, April 8, 2016

దేవతల నరసింహ స్తుతి - అనిన నౌఁ గాక

7-346-వ.
అనిన "నౌఁ గాక" యని మహాభాగవతశేఖరుం డయిన బాలకుండు కరకమలంబులు ముకుళించి మందగమనంబున నమంద వినయ వివేకంబుల నరసింహదేవుని సన్నిధికిం జని సాష్టాంగదండప్రణామంబు జేసిన భక్తపరాధీనుం డగు నయ్యీశ్వరుం డాలోకించి కరుణాయత్తచిత్తుండై.
టీకా:
          అనినన్ = అనగా; ఔగాక = సరే; అని = అని; మహా = గొప్ప; భాగవత = విష్ణుభక్తులలో; శేఖరుండు = శ్రేష్ఠుడు; అయిన = ఐన; బాలకుండు = పిల్లవాడు; కర = చేతులు యనెడి; కమలంబులు = పద్మములను; ముకుళించి = జోడించి; మంద = మెల్లని; గమనంబునన్ = నడకతో; అమంద = మిక్కలి; వినయ = అణకువ; వివేకంబులన్ = వివేకములతో; నరసింహ = నరసింహరూపమునగల; దేవుని = దేవుని; సన్నిధి = సమీపమున; కిన్ = కి; చని = వెళ్ళి; సాష్టాంగదండప్రణామంబున్ = సాష్టాంగనమస్కారము {సాష్టాంగదండప్రణామము - అష్టాంగములు (కాళ్ళు చేతులు రొమ్ము నొసలు భుజములు) నేలను తాకునట్లు కర్రవలె సాగిలపడి చేసడి ప్రణామము (నమస్కారము)}; చేసినన్ = చేయగా; భక్త = భక్తుల; పర = ఎడ; అధీనుండు = వశమగువాడు; అగు = ఐన; ఆ = ఆ; ఈశ్వరుండు = భగవంతుడు; ఆలోకించి = చూసి; కరుణా = దయా; ఆయత్త = కలిగిన; చిత్తుండు = మనసుగలవాడు; ఐ = అయ్యి;
భావము:
            ఇలా అని బ్రహ్మదేవుడు అనగానే పరమ భాగవతుడు భక్తశేఖరుడు అయిన ప్రహ్లాదుడు “అలాగే” అని, మెల్లమెల్లగా ఉగ్ర నరసింహుని సమీపించాడు; మిక్కిలి వినయంతో వినమ్రంతో ఆయన దివ్య పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారములు చేశాడు; అంతట భక్తవత్సలుడైన నారాయణుడు ప్రసన్నుడై ప్రహ్లాదుడిని ప్రేమగా చూశాడు.
७-३४६-व.
अनिन "नौँ गाक" यनि महाभागवतशेखरुं डयिन बालकुंडु करकमलंबुलु मुकुळिंचि मंदगमनंबुन नमंद विनय विवेकंबुल नरसिंहदेवुनि सन्निधिकिं जनि साष्टांगदंडप्रणामंबु जेसिन भक्तपराधीनुं डगु नय्यीश्वरुं डालोकिंचि करुणायत्तचित्तुंडै.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: