Sunday, April 3, 2016

దేవతల నరసింహ స్తుతి - ఇట్లు బ్రహ్మరుద్రేంద్ర

7-339-వ.
ఇట్లు బ్రహ్మరుద్రేంద్ర సిద్ధ సాధ్య పురస్సరులైన దేవముఖ్యు లందఱు నెడగలిగి యనేక ప్రకారంబుల వినుతించి; రందు రోషవిజృంభమాణుం డయిన నరసింహదేవుని డగ్గఱఁ జేర వెఱచి లక్ష్మీదేవిం బిలిచి; యిట్లనిరి.
టీకా:
          ఇట్లు = ఈ విధముగ; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; రుద్ర = పరమ శివుడు; ఇంద్ర = ఇంద్రుడు; సిద్ద = సిద్ధులు; సాధ్య = సాధ్యులు; పురస్సరులు = మొదలగువారు; ఐన = అయిన; దేవ = దేవతలలో; ముఖ్యులు = ప్రముఖులు; అందఱున్ = అందరును; ఎడ = దూరముగా; కలిగి = ఉండి; అనేక = పలు; ప్రకారంబులన్ = విధములుగా; వినుతించిరి = స్తుతించిరి; అందున్ = వారిలో; రోష = కోపము; విజృంభమాణుండు = అతిశయించినవాడు; అయిన = ఐన; నరసింహుని = నరసింహుని; డగ్గఱన్ = దగ్గరకు; చేరన్ = చేరుటకు; వెఱచి = భయపడి; లక్ష్మీదేవిన్ = లక్ష్మీదేవిని; పిలిచి = పిలిచి; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:
            ఇలా ఉగ్ర నరసింహుని ప్రసన్నం చేసుకోవటానికి, బ్రహ్మదేవుడు, మహేశ్వరుడు, మహేంద్రుడు, సిద్ధులు మున్నగు దేవతా ప్రముఖులు అందరూ పరిపరి విదాల ప్రార్థించారు. అయినా ఆయన ఉగ్ర స్వరూపం శాంతించలేదు. అంతటి రోషభీషణాకారంతో ఒప్పుతున్న నరసింహస్వామిని సమీపించటానికి కూడా బెదిరిన దేవతలు అందరూ, లక్ష్మీ దేవిని ఆహ్వానించి ఇలా విన్నవించారు.
७-३३९-व.
इट्लु ब्रह्मरुद्रेंद्र सिद्ध साध्य पुरस्सरुलैन देवमुख्यु लंदर्रु नेडगलिगि यनेक प्रकारंबुल विनुतिंचि; रंदु रोषविजृंभमाणुं डयिन नरसिंहदेवुनि डग्गर्रँ जेर वेर्रचि लक्ष्मीदेविं बिलिचि; यिट्लनिरि.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: