Friday, April 15, 2016

ప్రహ్లాదుడు స్తుతించుట - కావున నల్పుఁడ

7-353-క.
కావున నల్పుఁడ సంస్తుతి
గావించెద వెఱపు లేక లనేరుపునన్
నీ ర్ణనమున ముక్తికిఁ
బోవు నవిద్యను జయించి పురుషుఁ డనంతా!
టీకా:
          కావునన్ = కనుక; అల్పుడ = చిన్నవాడను; సంస్థుతి = స్తోత్రములు; కావించెద = చేసెదను; వెఱపు = బెదురు; లేక = లేకుండగ; కల = కలిగినంత; నేరుపునన్ = సామర్ధ్యముతో; నీ = నీ యొక్క; వర్ణనమునన్ = స్తుతించుటవలన; ముక్తి = మోక్షపదమున; కిన్ = కు; పోవున్ = వెళ్ళును; అవిద్యన్ = అవిద్యను; జయించి = జయించి; పురుషుండు = మానవుడు; అనంతా = నారాయణా {అనంతుడు - అంతము లేనివాడు, హరి}.
భావము:
            శాశ్వతుడా! శ్రీహరీ! మానవుడు కేవలం నీ గుణాలను కీర్తించటం ద్వారా అవిద్యను జయించి కైవల్యాన్ని అందుకుంటాడు కదా. కనుక, నేను అల్పుడను. కొద్దిపాటి జ్ఞానమే నాకున్నా, బెదరకుండా నా నేర్పుకొలది స్తుతిస్తున్నాను. నా ప్రార్థన మన్నించు.
7-353-క.
कावुन नल्पुँड संस्तुति
गाविंचेद वेर्रपु लेक कलनेरुपुनन्;
नी वर्णनमुन मुक्तिकिँ
बोवु नविद्यनु जयिंचि पुरुषुँ डनंता!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: