Sunday, March 27, 2016

దేవతల నరసింహ స్తుతి - ఆడుదుము

7-325-వ.
గంధర్వు లిట్లనిరి.
7-326-క.
డుదుము రేయుఁబగలుం
బాడుదుము నిశాటు నొద్దబాధించు దయం
జూడఁడు నీచే జమునిం
గూడె మహాపాతకునకుఁ గుశలము గలదే.
టీకా:
          గంధర్వులు = గంధర్వులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
          ఆడుదుము = నాట్యముచేసెదము; రేయున్ = రాత్రులందు; పగలున్ = పగళ్ళయందు; పాడుదుము = పాడెదము; నిశాటున్ = రాక్షసుని {నిశాటుడు - రాత్రించరుడు, రాక్షసుడు}; ఒద్దన్ = దగ్గర; బాధించున్ = బాధపెట్టును; దయన్ = కరుణతో; చూడడు = చూడడు; నీ = నీ; చేన్ = చేత; జమునిగూడెన్ = చనిపోయెను {జమునిగూడు - జముని (యముని) కూడు (కలియు), మరణించు}; మహా = అతి; పాతకున్ = తీవ్రమైనపాపములుగలవాని; కున్ = కు; కుశలము = క్షేమము; కలదే = ఉండునా ఏమి.
భావము:
            గంధర్వులు ఇలా అంటూ గానాలు చేసారు.
            ప్రభూ! రాత్రిం బవళ్ళు ఈ రాక్షసుడి సమక్షంలో గానం చేసేవాళ్ళం; నాట్యం చేసే వాళ్ళం; అయినా మమ్మల్ని ఎంతో హీనంగా చూసి బాధించేవాడు; ఏనాడూ దయగా చూడలేదు. వీడిలాంటి మహాపాపిష్టి వానికి మంగళం ఎలా కలుగుతుందా? చివరికి నీ వల్ల యమపురికి పోయాడు”
७-३२५-व.
गंधर्वु लिट्लनिरि.
७-३२६-क.
आडुदुमु रेयुँबगलुं
बाडुदुमु निशाटु नोद्द, बाधिंचु दयं
जूडँडु नीचे जमुनिं
गूडे महापातकुनकुँ गुशलमु गलदे.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: