Wednesday, March 2, 2016

నృసింహరూపావిర్భావము – అని మెత్తంబడని

7-288-వ.
అని మెత్తంబడని చిత్తంబున గద యెత్తికొని తత్తఱంబున నార్చుచు నకుంఠిత కంఠీరవంబు డగ్గఱు గంధసింధురంబు చందంబున నక్తంచరకుంజరుండు నరసింహదేవున కెదురునడచి తదీయదివ్యతేజోజాలసన్నికర్షంబునం జేసి దవానలంబు డగ్గఱిన ఖద్యోతంబునుం బోలెఁ గర్తవ్యాకర్తవ్యంబులు దెలియక నిర్గతప్రభుండయి యుండె; అప్పుడు.
టీకా:
అని = అని; మెత్తంబడని = సడలని; చిత్తంబునన్ = మనసుతో; గద = గదను; ఎత్తికొని = ఎత్తపట్టుకొని; తత్తఱంబునన్ = వేగిరపాటుతో; ఆర్చుచున్ = అరుచుచు; అకుంఠిత = మొక్కవోనిపరాక్రమముగల; కంఠీరవంబున్ = సింహమును; డగ్గఱు = చేరెడి; గంధసింధూరను = మదించినఏనుగు; చందంబునన్ = వలె; నక్తంచర = రాక్షస; కుంజరుండు = శ్రేష్ఠుడు; నరసింహదేవున్ = నరసింహదేవుని; కున్ = కి; ఎదురు = ఎదురు; నడచి = వెళ్ళి; తదీయ = ఆమూర్తి యొక్క; దివ్య = దివ్యమైన; తేజస్ = తేజస్సు; జాల = పుంజము; సత్ = అధికముగ; నికర్షంబునన్ = తగులుట; చేసి = వలన; దవానలంబు = కార్చిచ్చు; డగ్గఱిన = దగ్గరకుచేరిన; ఖద్యోతంబునున్ = మిణుగురుపురుగు; పోలెన్ = వలె; కర్తవ్య = చేయదగ్గవి; అకర్తవ్య = చేయదగనివి; తెలియక = వివేకముపోయి; నిర్గత = పోయిన, వెలవెలబోయిన; ప్రభుండు = ప్రభావముగలవాడు; అయి = అయ్యి; ఉండెన్ = ఉండెను; అప్పుడు = అప్పుడు.
భావము:
అని భావించిన హిరణ్యకశిపుడు వెనుకంజ వేయకుండా దృఢ స్థైర్యంతో గద ఎత్తి పట్టుకొని, తొట్రుపాటుతో అరుస్తూ ముందుకు నడుస్తున్నాడు. మృగరాజుకు ఎదురువెళ్ళే మదగజం లాగ ఆ రాక్షసేశ్వరుడు నరసింహమూర్తికి ఎదురు నడిచాడు. ఆ దేవాధిదేవుని దివ్యకాంతి సమూహాల ముందు హిరణ్యకశిపుడు దావానలం ముందు మిణుగురు పురుగులాగ ముందుకు పోతున్నాడు. కర్తాకర్తవ్యాలను మరచిపోయాడు. తన తేజస్సును కోల్పోయాడు.
७-२८८-व.
अनि मेत्तंबडनि चित्तंबुन गद येत्तिकोनि तत्तर्रंबुन नार्चुचु नकुंठित कंठीरवंबु डग्गर्रु गंधसिंधुरंबु चंदंबुन नक्तंचरकुंजरुंडु नरसिंहदेवुन केदुरुनडचि तदीयदिव्यतेजोजालसन्निकर्षंबुनं जेसि दवानलंबु डग्गर्रिन खद्योतंबुनुं बोलेँ गर्तव्याकर्तव्यंबुलु देलियक निर्गतप्रभुंडयि युंडे; अप्पुडु.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: