Wednesday, March 16, 2016

దేవతల నరసింహ స్తుతి - కరకమలయుగ

7-304-క.
కమలయుగళ కీలిత
శిరులై డగ్గఱక భక్తిఁ జేసిరి బహు సం
ణాబ్ధి తరికి నఖరికి
భోజనహస్తి హరికి రకేసరికిన్.
టీకా:
          కర = చేతులు యనెడి; కమల = పద్మముల; యుగళ = జంటలచే; కీలిత = తగల్చబడిన; శిరులు = తలలు కలవారు; ఐ = అయ్యి; డగ్గఱక = దగ్గరకుచేరక; భక్తిన్ = ప్రపత్తిని; చేసిరి = చూపిరి; బహు = విస్తారమైన; సంసరణ = సంసారము యనెడి; అబ్ది = సముద్రమును; తరి = దాటించువాని; కిన్ = కి; నఖరి = గోళ్లుగలవాని; కిన్ = కి; నరభోజన = రాక్షసులు యనెడి {నరభోజనులు - నర (మానవులను) భోజనులు (తినెడివారు), రాక్షసులు}; హస్తి = ఏనుగుకి; హరి = సింహము యైనవాని; కిన్ = కి; నరకేసరి = నరసింహుని; కిన్ = కి.
భావము:
            అసంఖ్యాత కష్టాల సాగరమైన సంసారాన్ని తరింపజేసేవాడూ; నరులను భక్షించే రాక్షసజాతిలో మదించిన ఏనుగు అంత బలిష్ఠుడైన ఆ హిరణ్యకశిపుడిని సింహ పరాక్రమంతో హరింప జేసిన వాడూ అయిన నరసింహావతారుడిని; తమ కమలాలవంటి చేతులు రెంటిని జోడించి శిరస్సున జేర్చి దూరం నుండే భక్తితో నమస్కరించారు.
७-३०४-क.
करकमलयुगळ कीलित
शिरुलै डग्गर्रक भक्तिँ जेसिरि बहु सं
सरणाब्धि तरिकि नखरिकि
नरभोजनहस्ति हरिकि नरकेसरिकिन्.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: