Friday, February 5, 2016

ప్రహ్లాదుని జన్మంబు - చొక్కపు

7-254-క.
చొక్కపు రక్కసికులమున
వెక్కురు జన్మించినాఁడు విష్ణునియందున్
నిక్కపు మక్కువ విడువం
డెక్కడి సుతుఁ గంటి రాక్షసేశ్వర! వెఱ్ఱిన్."
టీకా:
    చొక్కపు = స్వచ్ఛమైన; రక్కసి = రాక్షస; కులమున = వంశమున; వెక్కురు = వెఱ్ఱివాడు; జన్మించినాడు = పుట్టినాడు; విష్ణుని = హరి; అందున్ = ఎడల; నిక్కపు = సత్యమైన; మక్కువ = ప్రీతి; విడువండు = వదలుడు; ఎక్కడి = ఎలాంటి; సుతున్ = పుత్రుని; కంటి = పుట్టింటితివి; రాక్షసేశ్వరా = రాక్షసరాజా; వెఱ్ఱిన్ = వెర్రివాడిని.
భావము:
            స్వచ్చమైన రాక్షస వంశంలో వికారాలు గలవాడు పుట్టాడు. ఎంత చెప్పినా విష్ణువుమీద మమత వదలడు. ఎలాంటి కొడుకును కన్నావయ్యా హిరణ్యకశిపమహారాజ!
७-२५४-क. 
चोक्कपु रक्कसिकुलमुन
वेक्कुरु जन्मिंचिनाँडु विष्णुनियंदुन्
निक्कपु मक्कुव विडुवं
डेक्कडि सुतुँ गंटि राक्षसेश्वर! वेर्र्र्रिन्."
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: