Tuesday, February 2, 2016

ప్రహ్లాదుని జన్మంబు - రక్షో బాలుర

7-251-శా.
"క్షో బాలుర నెల్ల నీ కొడుకు చేరంజీరి లోలోన నా
శిక్షామార్గము లెల్ల గల్ల లని యాక్షేపించి తా నందఱన్
మోక్షాయత్తులఁ జేసినాఁడు మనకున్ మోసంబు వాటిల్లె; నీ
క్షత్వంబునఁ జక్కఁజేయవలయున్ దైతేయవంశాగ్రణీ!
టీకా:
రక్షస్ = రాక్షస; బాలురన్ = బాలలను; ఎల్లన్ = అందరను; నీ = నీ; కొడుకు = పుత్రుడు; చేరన్ = దగ్గరకు; చీరి = పిలిచి; లోలోనన్ = రహస్యముగా; నా = నా యొక్క; శిక్షా = ఉపదేశ; మార్గములు = విధానములు; ఎల్లన్ = అన్నియు; కల్లలు = అసత్యములు; అని = అని; ఆపేక్షించి = దూరి; తాన్ = తను; అందఱన్ = అందరిని; మోక్ష = ముక్తిమార్గమునకు; ఆయత్తులను = ఆసక్తులుగా; చేసినాడు = చేసెను; మన = మన; కున్ = కు; మోసంబు = కీడు; వాటిల్లెన్ = కలిగినది; నీ = నీ యొక్క; దక్షత్వంబునన్ = సామర్థ్యమున; చక్కజేయవలయును = సరిదిద్దవలెను; దైతేయవంశాగ్రణీ = హిరణ్యకశిపుడా {దైతేయవంశాగ్రణి - దైతేయ (దితిజులైన రాక్షస) వంశమునకు అగ్రణి (గొప్పవాడు), హిరణ్యకశిపుడు}.
భావము:
            ఓ దైత్య కుల శిరోమణి! హిరణ్యకశిప మహారాజా! నీ కుమారుడు రాక్షస కుమారులను అందరినీ రహస్య ప్రదేశాలకు తీసుకెళ్లి, నేను చెప్పే చదువులు అన్నీ బూటకములు అని ఆక్షేపించాడు. రాక్షస విద్యార్థులకు అందరికి మోక్షమార్గం బోధిస్తున్నాడు. మనకు తీరని ద్రోహం చేస్తున్నాడు. మరి నీవు ఏం చేస్తావో! చూడు. నీ కొడుకు దుడుకుతనం మితిమీరిపోతోంది. పరిస్థితి చెయ్యి దాటిపోయేలా ఉంది. ఇక వాడిని చక్కబెట్టటానికి నీ సామర్థ్యం వాడాల్సిందే.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: