Saturday, February 13, 2016

ప్రహ్లాదుని జన్మంబు - బలవంతుఁడ

7-262-క.
వంతుఁడ నే జగముల
ములతోఁ జనక వీరభావమున మహా
లుల జయించితి నెవ్వని
మున నాడెదవు నాకుఁ బ్రతివీరుఁడ వై."
7-263-వ.
అనినఁ దండ్రికి మెల్లన వినయంబునఁ గొడు కిట్లనియె.
టీకా:
          బలవంతుడ = శక్తిశాలిని; నేన్ = నేను; జగములన్ = లోకములను; బలముల = సైన్యముల; తోన్ = తోటి; చనక = వెళ్ళక; వీరభావమునన్ = శూరత్వముతో; మహా = మిగుల; బలులన్ = బలవంతులను; జయించితిన్ = నెగ్గితిని; ఎవ్వని = ఎవని; బలమునన్ = దన్నుతో; ఆడెదవు = పలికెదవు; నా = నా; కున్ = కు; ప్రతివీరుడవు = ఎదిరించెడి శూరుడవు; ఐ = అయ్యి.
          అనినన్ = అనగా; తండ్రి = తండ్రి; కిన్ = కి; మెల్లన = మెల్లిగా; వినయంబునన్ = అణకువతో; కొడుకు = పుత్రుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:
            బాలకా! ప్రహ్లాద! లోకా లన్నిటిలో నేనే అందరి కన్నా బలవంతుణ్ణి; సైన్యం ఏమీ తీసుకెళ్ళకుండా ఒంటరిగా వెళ్ళి ఎందరో బలశాలుల్ని గెలిచిన శూరుణ్ణి; అలాంటి నాకు సాటి రాగల వీరుడిలా, ఎవరి అండ చూసుకొని, ఎదురు తిరుగుతున్నావు.
            అలా కోపంగా పలికిన తండ్రితో కొడుకు ప్రహ్లాదుడు ఇలా అన్నాడు.
७-२६२-क.
बलवंतुँड ने जगमुल
बलमुलतोँ जनक वीरभावमुन महा
बलुल जयिंचिति नेव्वनि
बलमुन नाडेदवु नाकुँ ब्रतिवीरुँड वै."
७-२६३-व.
अनिनँ दंड्रिकि मेल्लन विनयंबुनँ गोडु किट्लनिये.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: