Saturday, January 9, 2016

ప్రహ్లాదుని హింసించుట - సేవింతుము నిన్నెప్పుడు

7-221-క.
సేవింతుము నిన్నెప్పుడు
భావింతుము రాజ వనుచు హుమానములం
గావింతుము తెలియము నీ
కీ వింతమతిప్రకాశ మే క్రియఁ గలిగెన్."
7-222-వ.
అని యిట్లు దైత్యనందనులు దన్నడిగినఁ బరమభాగవతకు లాలంకారుం డైన ప్రహ్లాదుండు నగి తనకుఁ బూర్వంబునందు వినంబడిన నారదు మాటలు దలంచి యిట్లనియె.
టీకా:
          అని = అని; ఇట్లు = ఈ విధముగ; దైత్య = రాక్షస; నందనులు = బాలురు; తన్నున్ = తనను; అడిగిన = అడుగుగా; పరమ = అత్యుత్తమమైన; భాగవత = భాగవతుల; కుల = సమూహమునకు; అలంకారుండు = అలంకారప్రాయుడు; ఐన = అయిన; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; నగి = నవ్వి; తన = తన; కున్ = కును; పూర్వమున్ = ఇంతకు పూర్వము; అందు = అందు; వినంబడిన = చెప్పబడిన; నారదు = నారదుని యొక్క; మాటలు = ఉపదేశములను; తలంచి = గుర్తుచేసుకొని; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
          సేవింతుము = సేవించెదము; నిన్నున్ = నిన్నే; ఎప్పుడున్ = ఎల్లప్పుడును; భావింతుము = అనుకొనెదము; రాజవు = (నీవే) రాజువు; అనుచున్ = అనుచు; బహు = అనేకమైన; మానములన్ = గౌరవములను; కావింతుము = చేసెదము; తెలియుము = తెలియచెప్పుము; నీ = నీ; కున్ = కును; ఈ = ఈ; వింత = అద్భుతమైన; మతిన్ = జ్ఞానము; ప్రకాశము = తెలియుట; ఏ = ఏ; క్రియన్ = విధముగ; కలిగెన్ = కలిగెను.
భావము:
            ప్రహ్లాదా! మేము ఎప్పుడు నీతోటే ఉంటాము. నువ్వే మా రాజు వని రకరకాలుగా గౌరవిస్తూనే ఉంటాము. కానీ నీ వింతటి మహనీయుడవు అని ఇప్పటిదాకా మాకు తెలియదు. ఈ విచిత్రమైన జ్ఞానం నీకు ఎలా లభించింది. వివరంగా చెప్పు.”
            ఇలా తన సహాధ్యాయులైన దానవ బాలకులు అడుగగా, పరమ భాగవతుడు, మహా భక్తుడు అయిన ప్రహ్లాదుడు నవ్వి, ఇంతకు పూర్వం నారదుని ద్వారా తాను విన్న తత్వం గుర్తుకు తెచ్చుకుని ఇలా చెప్పాడు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: