Tuesday, June 30, 2015

హిరణ్యాక్ష హిరణ్యకశిపులు కథ - భుజశక్తి

7-32-సీస పద్యము
భుజశక్తి నాతోడఁ బోరాడ శంకించి; మున్నీట మునిఁగిన మునుఁగుఁ గాక;
లయించి పెనఁగు నా చలసంభ్రమమున; కెఱఁగి వెన్నిచ్చిన నిచ్చుఁ గాక;
గడంబు సైఁపక సౌకర్యకాంక్షియై; యిల క్రింద నీఁగిన నీఁగుఁ గాక;
క్రోధించి యటుగాక కొంత పౌరుషమున; రి భంగి నడరిన డరు గాక;
7-32.1-ఆటవెలది
ఠినశూలధారఁ గంఠంబు విదళించి, వాని శోణితమున వాఁడి మెఱసి,
త్సహోదరునకు హిఁ దర్పణము జేసి, మెఱసివత్తు మీకు మేలు దెత్తు.
          విష్ణుడు నా బాహుబల పరాక్రమాలు విని భయపడి సముద్రంలో దాగినప్పటికీ, నా శౌర్యసాహసాలు చూసి వెన్నిచ్చి పారిపోయినప్పటికీ, నాతో పోరు ఎందుకులే, బ్రతికి ఉంటే చాలు అనుకుని భయపడిపోయి వరాహంగా భూమిని తవ్వుకుంటూ పాతాళానికి పోయినా సరే, లేదా అలా కాకుండా కోపంతో, పౌరుషంతో నాతో ఎదిరి రణరంగంలో సింహ పరాక్రమం చూపుతూ పోరాటానికి సిద్ధపడినా ఎలాగైనా సరే, ఏమైనా సరే వాడిని మాత్రం ఎప్పటికి వదలి పెట్టను. ఈ వాడి బల్లెంతో వాడి తల తరిగేస్తాను. ఆ వేడి నెత్తురుతో మా తమ్ముడికి తర్పణం వదులుతాను. తప్పక విజయం సాధించి తిరిగి వస్తాను. మీ అందరికి మేలు జేస్తాను.
७-३२-सीस पद्यमु
भुजशक्ति नातॉडँ बॉराड शंकिंचि; मुन्नीट मुनिँगिन मुनुँगुँ गाक;
अलयिंचि पेनँगु ना यचलसंभ्रममुन; केर्रँगि वेन्निच्चिन निच्चुँ गाक;
जगडंबु सैँपक सौकर्यकांक्षियै; यिल क्रिंद नीँगिन नीँगुँ गाक;
क्रॉधिंचि यटुगाक कोंत पौरुषमुन; हरि भंगि नडरिन नडरु गाक;
७-३२.१-आटवेलदि
कठिनशूलधारँ गंठंबु विदळिंचि, वानि शॉणितमुन वाँडि मेर्रसि,
मत्सहॉदरुनकु महिँ दर्पणमु जॅसि, मेर्रसिवत्तु मीकु मॅलु देत्तु.
            భుజ = బాహువుల; శక్తిన్ = బలముతో; నా = నా; తోడన్ = తోటి; పోరాడన్ = యుద్ధముచేయుటకు; శంకించి = జంకి; మున్నీటన్ = సముద్రములో; మునిగినన్ = మునిగినచో; మునుగుగాక = మునుగుగాక (మత్యావతార సూచన); అలయించి = శ్రమించి; పెనగు = పోరెడి; నా = నా యొక్క; అచల = గట్టి; సంభ్రమమున్ = పూనిక; కున్ = కి; ఎఱగి = వంగి; వెన్నిచ్చినన్ = వీపుచూపిన (కూర్మావతార సూచన); ఇచ్చుగాక = చూపుగాక; జగడంబున్ = పోరాటముచేయుటను; సైపక = సహింపలేక; సౌకర్య = సౌఖ్యము, సూకరాకారము; కాంక్షి = కోరువాడు; = అయ్యి; ఇల = భూమి; క్రిందన్ = కింద; ఈగినన్ = దూరినచో; నీగుగాక = దూరుగాక (వరాహవతార సూచన); క్రోధించి = పౌరుషపడి; అటుగాక = అలా కాకుండగ; కొంత = కొంచము; పౌరుషమున = పొరుషముతో; హరి = సింహము; భంగిన్ = వలె; అడరినన్ = అతిశయించిన; అడరుగాక = అతిశయించుగాక.
            కఠిన = కరకు; శూల = శూలముయొక్క; ధారన్ = వాడిదనముచే; కంఠంబున్ = కంఠమును; విదళించి = ఖండించి; వాని = అతని; శోణితమునన్ = రక్తముతో; వాడి = మగటిమ; మెఱసి = చెలరేగి; మత్ = నా యొక్క; సహోదరున్ = సోదరున; కున్ = కు; మహిన్ = భూమిపై; తర్పణముజేసి = తర్పణలువదలి; మెఱసి = అతిశయించి; వత్తున్ = వచ్చెదను; మీ = మీరల; కున్ = కు; మేలున్ = శుభములను; తెత్తున్ = తీసుకొచ్చెదను.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Monday, June 29, 2015

హిరణ్యాక్ష హిరణ్యకశిపులు కథ - వనములనుండు

7-31-చంపకమాల
ములనుండుఁ జొచ్చు ముని ర్గములోపల ఘోణిగాఁడు సం
న మెఱుంగ రెవ్వరును జాడ యొకింతయు లేదు తన్ను డా
సిమఱి డాయు వెంటఁబడి చిక్కక చిక్కఁడు వీని నొక్క కీ
లుమన మెల్ల లోఁబడక లోఁబడఁ బట్టుకొనంగవచ్చునే?
            ఆ సూకరం గాడు మహా మాయగాడు. నీళ్ళల్లో దాక్కుంటాడు. అడవులలో దాక్కుంటాడు. మునుల మనసులలో దూరతాడు. పుట్టుపూర్వోత్తరాలు ఏవీ ఎవరికీ తెలియవు. అసలు ఎక్కడివాడో కూడా తెలియదు. దరిచేరిన వారిని ఆదరిస్తాడట. కాని వెంటబడి పట్టుకుందాం అంటే దొరకనే దొరకడు, అలసిపోడు. కాబట్టి మనం ఒక ఉపాయం పన్నాలి. మనం వాడికి లొంగకుండా వాడిని లొంగదీసుకుందాం, సరేనా? (ఇది సాధ్యమా?) అని హిరణ్యకశిపుడు రాక్షసులతో అంటున్న నిందలో ధ్వనిస్తున్న స్తుతి ఎంతో చక్కగా ఉంది.
७-३१-चंपकमाल
वनमुलनुंडुँ जोच्चु मुनि वर्गमुलॉपल घॉणिगाँडु सं
जनन मेर्रुंग रेव्वरुनु जाड योकिंतयु लॅदु तन्नु डा
सिन मर्रि डायु वेंटँबडि चिक्कक चिक्कँडु वीनि नोक्क की
लुन मन मेल्ल लँबडक लँबडँ बट्टुकोनंगवच्चुनॅ?
            వనములన్ = అడవులందు, నీటియందు; ఉండున్ = ఉండును; చొచ్చున్ = ప్రవేశించును; ముని = మునుల; వర్గము = సమూహముల; లోపల = మనసులలోపల; ఘోణిగాడు = వరాహస్వరూపుడు; సంజననము = అసలు పుట్టుక; ఎఱుంగరు = తెలిసికొనలేరు; ఎవ్వరును = ఎవరూకూడ; జాడ = గుర్తించుటకు; ఒకింతయున్ = కొంచముకూడ; లేదు = అవకాశములేదు; తన్ను = తనను; డాసినన్ = సమీపించెదమంటే; మఱి = మరి; డాయున్ = దగ్గరగును, దాగికొనును; వెంటబడి = వెనుకనంటినను; చిక్కక = ఆశ్రయించక, దొరకనే; చిక్కడు = దొరకడు; వీనిన్ = ఇతనిని; ఒక్క = ఒక; కీలునన్ = ఉపాయముచే, యుక్తిచే; మనము = మనము; ఎల్లన్ = అందరము; లోబడక = అతనికివశముగాక, వెనుదీయక; లోబడన్ = చిక్కునట్లు; పట్టుకొనంగ = పట్టుకొనుట; వచ్చునే = సాధ్యమా ఏమి.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Sunday, June 28, 2015

హిరణ్యాక్ష హిరణ్యకశిపులు కథ - నాకుందమ్ముడు

7-30-శార్దూల విక్రీడితము
నాకుం దమ్ముఁడు మీకు నెచ్చెలి రణన్యాయైకదక్షుండు బా
హాకుంఠీకృతదేవయక్షుఁడు హిరణ్యాక్షుండు వానిన్ మహా
సౌర్యాంగము దాల్చి దానవవధూసౌకర్యముల్ నీఱుగా
వైకుంఠుండు వధించిపోయెనఁట యీ వార్తాస్థితిన్ వింటిరే.
          ఓ రాక్షసోత్తములారా! ఈ కబురు విన్నారా? వైకుంఠవాసి విష్ణువు హిరణ్యాక్షుణ్ణి చంపేసాడట. సౌకర్యంగా ఉంటుందని వరాహం రూపుతో వచ్చి ముట్టి కొమ్ముతో కుమ్మి మరీ చంపేసాడట. అవును సాక్షాత్తు నాకు తమ్ముడు, మీ అందరికి ఆత్మీయ మిత్రుడు అయిన హిరణ్యాక్షుడు సామాన్యమైన వాడా. యుద్ధ ధర్మం మర్మం బాగా తెలిసిన వాడు. బాహు బలంతో దేవగణ, యక్షగణాలను నిర్వీర్యులను చేసిన మహా పరాక్రమశాలి. అంతటి వానిని ఆ హరి సంహరించి అంతఃపురాలలోని రాక్షస కాంతల సౌభాగ్యాలు హరించి పోయాడట.
७-३०-शार्दूल विक्रीडितमु
नाकुं दम्मुँडु मीकु नेच्चेलि रणन्यायैकदक्षुंडु बा
हाकुंठीकृतदॅवयक्षुँडु हिरण्याक्षुंडु वानिन महा
सौकर्यांगमु दाल्चि दानववधूसौकर्यमुल नीर्रुगा
वैकुंठुंडु वधिंचिपॉयेनँट यी वार्तास्थितिन विंटिरॅ.
            నా = నా; కున్ = కు; తమ్ముడు = సోదరుడు; మీ = మీరల; కున్ = కు; నెచ్చెలి = ప్రియమిత్రుడు; రణ = యుద్ద; న్యాయ = నీతి; ఏక = సమస్తము నందు; దక్షుండు = సమర్థుడు; బాహా = చేతులచేత; కుంఠీకృత = లోబరుచుకొనబడిన; దేవ = దేవతలు; యక్షుడు = యక్షులు గలవాడు; హిరణ్యాక్షుండు = హిరణ్యాక్షుడు; వానిన్ = అతనిని; మహా = గొప్ప; సౌకర్య = (సూకర) వరాహపు; అంగమున్ = దేహమును; తాల్చి = ధరించి; దానవ = రాక్షస; వధూ = వనితల; సౌకర్యముల్ = సౌభాగ్యములు; నీఱుగాన్ = నీరుగారి నశించునట్లు; వైకుంఠుండు = విష్ణుమూర్తి {వైకుంఠుడు - వైకుంఠముననుండు వాడు, విష్ణువు}; వధించిపోయెన్ = చంపివేసినాడు; అటన్ = అట; = ఇట్టి; వార్తా = వృత్తాంతము; స్థితిన్ = సంభవించుటను; వింటిరే = విన్నారా.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :