Wednesday, December 9, 2015

ప్రహ్లాద చరిత్ర - కాననివాని


prahladuni-ekanta-bhakthi-1.png

7-182-ఉత్పలమాల
కానివాని నూఁతగొని కాననివాఁడు విశిష్టవస్తువుల్
గాని భంగిఁ గర్మములు గైకొని కొందఱు కర్మబద్ధులై
కారు విష్ణుఁ, గొంద ఱటఁ గందుఁ రకించన వైష్ణవాంఘ్రిసం
స్థా రజోభిషిక్తు లగు సంహృతకర్ములు దానవేశ్వరా!
         తండ్రీ! రాక్షసేశ్వరా! గుడ్డివాడు మరొక గుడ్డివాడి సాయం తీసుకొని ఏ వస్తువును విశేషంగా తెలుసుకోలేడు కదా! అదే విధంగా విషయాసక్తులై కర్మబంధాలలో చిక్కుకున్నవారు శ్రీహరిని చూడలేరు. కొందరు పుణ్యాత్ములు మాత్రం గొప్ప విష్ణుభక్తుల పాద ధూళి తమ తలమీద ధరించి కర్మలను త్యజించి పూత చిత్తులు అవుతారు; అంతట వారు వైకుంఠవాసుని వీక్షించగలుగుతారు.
७-१८२-उत्पलमाल
काननिवानि नूँतगोनि काननिवाँडु विशिष्टवस्तुवुल्
गाननि भंगिँ गर्ममुलु गैकोनि कोंदर्रु कर्मबद्धुलै
कानरु विष्णुँ, गोंद र्रटँ गंदुँ रकिंचन वैष्णवांघ्रिसं
स्थान रजोभिषिक्तु लगु संहृतकर्मुलु दानवेश्वरा!
          కానని = చూడలేని; వానిన్ = వానిని; ఊతన్ = ఊతముగ; కొని = తీసుకొని; కానని = గుడ్డి; వాడు = వాడు; విశిష్ట = శ్రేష్ఠమైన; వస్తువుల్ = వస్తువులను; కానని = చూడలేని; భంగిన్ = వలె; కర్మములున్ = కర్మలను; కైకొని = చేపట్టి; కొందఱు = కొంతమంది; కర్మ = కర్మలకు; బద్దులు = బధనమైనవారు; = అయ్యి; కానరు = చూడజాలరు; విష్ణున్ = నారాయణుని; కొందఱు = కొంతమంది; అటన్ = అక్కడ; కందురు = పొందెదరు; అకించన = కేవలమైన; వైష్ణవ = నారాయణుని; అంఘ్రి = పాదములందు; సంస్థాన = తగిలిన; రజః = ధూళిచేత; అభిషిక్తులు = అభిషేకింపబడినవారు; అగు = అయిన; సంహృత = విడిచిపెట్టిన; కర్ములు = కర్మములుగలవారు; దానవేశ్వరా = హిరణ్యకశిపుడ.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: