Monday, November 9, 2015

ప్రహ్లాద చరిత్ర - అంధప్రక్రియ

7-132-శార్దూల విక్రీడితము
అంప్రక్రియ నున్నవాఁడు, పలుకంస్మత్ప్రతాపక్రియా
గంధం బించుక లేదు, మీరు గురువుల్ కారుణ్యచిత్తుల్ మనో
బంధుల్ మాన్యులు మాకుఁ బెద్దలు, మముంబాటించి యీబాలకున్
గ్రంథంబుల్ చదివించి నీతికుశలుం గావించి రక్షింపరే.
7-133-వచనము
అని పలికి వారలకుఁ బ్రహ్లాదు నప్పగించి తోడ్కొని పొం డనిన వారును దనుజరాజకుమారునిం గొనిపోయి యతనికి సవయస్కులగు సహశ్రోతల నసురకుమారులం గొందఱం గూర్చి.
            అయ్యా! ఈ కుర్రాడు గ్రుడ్డి వాడిలా ఉన్నాడు. నా గొడవయే వీనికి పట్టదు. నా పరాక్రమములు, ఘనకార్యములు మాటవరసకైనా ఎన్నడు. మీరు మాకు అన్ని విధాల గురువులు, పెద్దలు, పూజ్యులు. మీరు దయామయ స్వభావము గలవారు, ఆత్మ బంధువులు. మమ్మనుగ్రహంచి యీ చిన్నాడికి చదువు చెప్పి పండితుడిని చేసి నన్ను కృతార్థుడిని చేయండి.అని హిరణ్యకశిపుడు చదువు చెప్పే బాధ్యత అప్పజెప్పాడు.
            అలా పలికి వారికి ప్రహ్లాదుడిని అప్పగించి మీ కూడా తీసుకెళ్లం డని చెప్పాడు. వారు ఆ హిరణ్యకశిప దనుజుని కొడుకును తీసుకెళ్లి అతని సమవయస్కులు అయిన సహాధ్యాయులను రాక్షసుల పిల్లలను కొంత మందిని సమకూర్చారు.
          అంధ = గుడ్డివాని; క్రియన్ = వలె; ఉన్నవాడు = ఉన్నాడు; పలుకండు = స్తుతింపడు; అస్మత్ = నా యొక్క; ప్రతాప = పరాక్రమపు; క్రియా = కార్యముల యొక్క; గంధంబున్ = అగరు, వాసన; ఇంచుకన్ = కొంచముకూడ; లేదు = లేదు; మీరు = మీరు; గురువుల్ = గురువులు; కారుణ్య = దయగల; చిత్తుల్ = మనసుగలవారు; మనస్ = మానసికముగా; బంధుల్ = బంధువులు; మాన్యులు = మన్నింపదగినవారు; మా = మా; కున్ = కు; పెద్దలు = గౌరవించదగినవారు; మమున్ = మమ్ములను; పాటించి = అనుగ్రహించి; = ; బాలకున్ = పిల్లవానిని; గ్రంథంబుల్ = మంచి పుస్తకములను; చదివించి = చదివించి; నీతి = నీతిశాస్త్రమునందు; కుశలున్ = నేర్పుగలవానినిగా; కావించి = చేసి; రక్షింపరే = కాపాడండి.
          అని = అని; పలికి = చెప్పి; వారల్ = వారి; కున్ = కి; ప్రహ్లాదున్ = ప్రహ్లాదుని; అప్పగించి = అప్పచెప్పి; తోడ్కొని = కూడతీసుకొని; పొండు = వెళ్ళండి; అనినన్ = అనగా; వారును = వారు; దనుజరాజకుమారునినన్ = ప్రహ్లాదుని {దనుజరాజకుమారుడు - దనుజు (రాక్షసు) రాజ (రాజుయొక్క) కుమారుడు (పుత్రుడు), ప్రహ్లాదుడు}; కొని = తీసుకొని; పోయి = వెళ్ళి; అతని = అతని; కిన్ = కి; = సమానమైన; వయస్కులు = వయస్సుగలవారు; అగున్ = అయిన; సహ = కూడ, కలిసి; శ్రోతలన్ = పఠించువారు {శ్రోతలు - (చదువులను) వినెడివారు, చదువుకొనువారు}; అసుర = రాక్షస వంశపు; కుమారులన్ = పిల్లలను; కొందఱన్ = కొంతమందిని; కూర్చి = జతచేసి.
७-१३२-शार्दूल विक्रीडितमु
अंधप्रक्रिय नुन्नवाँडु, पलुकं डस्मत्प्रताप क्रिया
गंधं बिंचुक लदु, मीरु गुरुवुल् कारुण्यचित्तुल् मनो
बंधुल् मान्युलु माकुँ बेद्दलु, ममुं बाटिंचि यी बालकुन्
ग्रंथंबुल् चदिविंचि नीतिकुशलुं गाविंचि रक्षिंपरे.
७-१३३-वचनमु
अनि पलिकि वारलकुँ ब्रह्लादु नप्पगिंचि तोड्कोनि पों डनिन वारुनु दनुजराजकुमारुनिं गोनिपोयि यतनिकि सवयस्कुलगु सहश्रोतल नसुरकुमारुलं गोंदर्रं गूर्चि.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: