Monday, November 30, 2015

ప్రహ్లాద చరిత్ర - తనుహృద్భాషల


7-167-మత్తేభ విక్రీడితము
నుహృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనా
ర్చముల్ సేవయు నాత్మలో నెఱుకయున్ సంకీర్తనల్ చింతనం
ను నీ తొమ్మిది భక్తిమార్గముల ర్వాత్మున్ హరిన్ నమ్మి
జ్జనుఁడై యుండుట భద్రమంచుఁ దలతున్ త్యంబు దైత్యోత్తమా!
           రాక్షసరాజా! భక్తి మార్గాలు తొమ్మిది; అవి సఖ్యం, శ్రవణం, దాస్యం, వందనం, అర్చనం, సేవనం, ఆత్మనివేదనం, కీర్తనం, చింతనం; ఈ నవ విధ భక్తులు అనే తొమ్మిది భక్తి మార్గాలను మనోవాక్కాయకర్మల (మనస్సు చేత, మాట చేత, క్రియ చేత ఒకే విధంగా నెరవేరుస్తూ, త్రికరణ సుద్ధిగా) సర్వాంతర్యామి అయిన శ్రీహరిని నమ్మి ఉత్తముడుగా జీవించుట మానవులకు ఉత్తమం అని నాకు అనిపిస్తుంది. ఇది కాక మరొక సత్యం నాకు కనబడుట లేదు.
           తనుహృద్భాషల = మనోవాక్కాయముల; సఖ్యమున్ = శుద్ధితో; శ్రవణమున్ = వినుటలు; దాసత్వమున్ = సేవించుటలు; వందన = నమస్కరించుటలు; అర్చనముల్ = పూజించుటలు; సేవయున్ = పరిచర్యలుచేయుట; ఆత్మ = మనసు; లోన్ = అందు; ఎఱుకయున్ = సదసద్వివేకము; సంకీర్తనల్ = కీర్తనలు పాడుట; చింతనంబున్ = ధ్యానము; అను = అనెడి; = ; తొమ్మిది = తొమ్మిది(9) {నవవిధభక్తి - 1సఖ్యము 2శ్రవణము 3దాసత్వము 4వందనము 5అర్చనము 6సేవ 7ఆత్మలోననెరుక 8సంకీర్తనము 9చింతనము}; భక్తి = భక్తియొక్క; మార్గములన్ = విధానములతో; సర్వాత్మున్ = నారాయణుని {సర్వాత్ముడు - సర్వస్వరూపి, విష్ణువు}; హరిన్ = నారాయణుని; నమ్మి = నమ్మి; సజ్జనుడు = సాధుస్వభావి; = అయ్యి; ఉండుట = ఉండుట; భద్రము = శ్రేయము; అంచున్ = అనుచు; తలతున్ = తలచెదను; సత్యంబు = నిజముగ; దైత్యోత్తమా = రాక్షసులలో ఉత్తముడా.
७-१६७-मत्तेभ विक्रीडितमु
तनुहृद्भाषलसख्यमुन् श्रवणमुन् दासत्वमुन् वंदना
र्चनमुल् सेवयु नात्मलो नेर्रुकयुन् संकीर्तनल् चिंतनं
बनु नी तोम्मिदि भक्तिमार्गमुल सर्वात्मुन् हरिन् नम्मि स
ज्जनुँडै युंडुट भद्रमंचुँ दलतुन् सत्यंबु दैत्योत्तमा!  
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Sunday, November 29, 2015

ప్రహ్లాద చరిత్ర - చదివించిరి

7-166-కంద పద్యము
దివించిరి నను గురువులు
దివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులు నేఁ
దివినవి గలవు పెక్కులు
దువులలో మర్మ మెల్లఁ దివితిఁ దండ్రీ!
            గురువుల దగ్గర యేం నేర్చుకొన్నా వని అడిగిన తండ్రి హిరణ్యాక్షునికి ప్రహ్లాదుడు సమాధానం చెప్తున్నాడు. నాన్నగారు! నాచే గురువులు ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం మొదలైన సర్వ శాస్త్రాలు చక్కగా వల్లెవేయించారు. అలా ఎన్నో శాస్త్రాలు నేర్చుకొన్నాను. సర్వ శాస్త్రాల రహస్య సారాన్ని పరమార్థాన్ని ఆకళింపు చేసుకొన్నాను.
          చదివించిరి = చదివించిరి; ననున్ = నన్ను; గురువులు = గురువులు; చదివితి = చదివితిని; ధర్మార్థముఖ్య = ధర్మార్థకామ; శాస్త్రంబులున్ = శాస్త్రములను; నేన్ = నేను; చదివినవి = చదివినట్టివి; కలవు = ఉన్నవి; పెక్కులు = అనేకమైనవి; చదువుల = చదువుల; లోన్ = అందలి; మర్మములు = రహస్యములు; ఎల్లన్ = అన్నిటిని; చదివితిన్ = చదివితిని; తండ్ర్రీ = తండ్రి.
७-१६६-कंद पद्यमु
चदिविंचिरि ननु गुरुवुलु
चदिविति धर्मार्थमुख्य शास्त्रंबुलु नेँ
जदिविनवि गलवु पेक्कुलु
चदुवुललो मर्म मेल्लँ जदिवितिँ दंड्री!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :