Friday, October 16, 2015

కాళియ మర్దన - ఆకులమయ్యె



10.1-688-ఉ.
కులమయ్యె భోగమిదె యౌదల లన్నియు వ్రస్సెఁ బ్రాణముల్
రాలఁబోకలం బొలిసె రాయిడి పెట్టక మా నిజేశుపై
నీ రుణాకటాక్షములు నిల్పఁగదే తగ నో! సమస్తలో
కైశరణ్య! యో! యభయకారణ! యో! కమలామనోహరా!
          ఆకులము = నలగినది; అయ్యెన్ = అయినది; భోగము = ఇతనిదేహము; ఇదె = ఇదిగో; ఔదలలు = పడగలు; అన్నియున్ = సర్వము; వ్రస్సెన్ = చిట్లెను; ప్రాణముల్ = పంచప్రాణవాయువులు; రాకలన్ = ఉఛ్వాశములు; పోకలన్ = నిశ్వాసములు; పొలిసె = క్షీణించెను; రాయిడి = బాధలు; పెట్టక = పెట్టకుండ; మా = మా యొక్క; నిజేశు = భర్త; పైన్ = మీద; నీ = నీ యొక్క; కరుణా = దయకలగిన; కటాక్షములున్ = కడగంటిచూపులను; నిల్పగదే = ఉంచుము; తగన్ = నిండుగా; ఓ = ఓ; సమస్తలోకైకశరణ్య = కృష్ణా {సమస్తలోకైకశరణ్యుడు - సమస్తమైన చతుర్దశభువనములను ఒక్కడే ఐన రక్షకుడు, విష్ణువు}; ఓ = ఓ; అభయకారణ = కృష్ణా {అభయకారణుడు - భక్తులకు భయములేకుండ చేయుటకు హేతువు ఐనవాడు, విష్ణువు}; ఓ = ఓ; కమలామనోహరా = కృష్ణా {కమలామనోహరుడు - కమల (లక్ష్మీదేవికి) మనోహరుడు (భర్త), విష్ణువు}.
१०.१-६८८-उ.
आकुलमय्ये भोगमिदे यौदल लन्नियु व्रस्सेँ ब्राणमुल्
राकलँबोकलं बोलिसे रायिडि पेट्टक मा निजेशुपै
नी करुणाकटाक्षमुलु निल्पँगदे तग नो! समस्तलो
कैकशरण्य! यो! यभयकारण! यो! कमलामनोहरा!
            అన్ని లోకాలలోను శరణు ఇవ్వగల ఒకే ఒక్క ప్రభువా! ఓ అభయమును ఇచ్చే దేవా! ఓ లక్ష్మీపతీ! ఇతని దేహమంతా నలిగి చితికిపోయింది. తలలు పగిలిపోయాయి. ప్రాణాలు వస్తుతున్నాయా, పోతున్నాయా అన్నట్లు ఉన్నాడు. ఇంకా బాధపెట్టకుండా, మా భర్త మీద నీ దయ గల చూపులు ప్రసరించి రక్షించు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: