Friday, September 25, 2015

కాళియ మర్దన - కుక్షిన్

10.1-666-శా.
కుక్షిన్ లోకములున్న గౌరవముతో గోపాకృతిన్నున్న యా
క్షోహంత వడిన్ మహాఫణిఫణారంగప్రదేశంబుపై
క్షీణోద్ధత నాడుఁ; బాడుఁ; జెలఁగున్హాసంబుతోడం బద
ప్రక్షేపంబులు చేయుఁ గేళిగతులం బ్రాణైకశేషంబుగన్.
          కుక్షిన్ = కడుపులో; లోకములు = చతుర్దశభువనములు; ఉన్న = ఉన్నట్టి; గౌరవము = భారము; తోన్ = తోటి; గోప = గొల్లవాని; ఆకృతిన్ = ఆకారముతో; ఉన్న = ఉన్న; ఆ = ఆ ప్రసిద్ధుడైన; రక్షోహంత = కృష్ణుడు {రక్షోహంత - రాక్షసులను సంహరించువాడు, విష్ణువు}; వడిన్ = వేగముగా; మహా = గొప్ప; ఫణి = పాము; ఫణా = పడగలనెడి; రంగ = వేదికా; ప్రదేశంబు = స్థలము; పైన్ = మీద; అక్షీణ = అధికమైన; ఉద్ధతన్ = అతిశయముతో; ఆడున్ = నాట్యమాడును; పాడున్ = పాటలుపాడును; చెలగున్ = విజృంభించును; హాసంబు = నవ్వుల; తోడన్ = తోటి; పద = అడుగులు; ప్రక్షేపంబులు = వేయుట; చేయున్ = చేయును; కేళీ = లీలా; గతులన్ = రీతులతో; ప్రాణ = ప్రాణము; ఏక = ఒకటిమాత్రమే; శేషంబు = మిగిలినది; కన్ = అగునట్లు.
१०.१-६६६-शा.
कुक्षिन् लोकमुलुन्न गौरवमुतो गोपाकृतिन्नुन्न या
रक्षोहंत वडिन् महाफणिफणारंगप्रदेशंबुपै
नक्षीणोद्धत नाडुँ; बाडुँ; जेलँगुन्; हासंबुतोडं बद
प्रक्षेपंबुलु चेयुँ गेळिगतुलं ब्राणैकशेषंबुगन्.
            గోపబాలకుని రూపంలో ఉన్న రాక్షస సంహారకుడైన శ్రీకృష్ణుడి కడుపులో లోకాలన్నీ ఉన్నాయి. ఆ బరువుతో సహా కాళియుడి పడగలనే మండపంమీద మిక్కలి ఉల్లాసంగా వేగంగా నృత్యం చేసాడు. పాటలు పాడాడు. చెలరేగి నవ్వుతు గంతులు వేసాడు. పాదాలతో బలంగా తొక్కుతు ఆటలాడాడు. కాళియుడి తల ప్రాణాలు తోక్కొచ్చాయి.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: