Friday, August 7, 2015

బ్రహ్మవరములిచ్చుట - దివిజానీక

7-85-మత్తేభ విక్రీడితము
దివిజానీకవిరోధి మ్రొక్కెఁ, గని వాగ్దేవీమనోనేతకున్
విశేషోత్సవ సంవిధాతకు, నమత్సంత్రాతకున్, సత్తపో
నిహాభీష్టవరప్రదాతకు, జగన్నిర్మాతకున్, ధాతకున్,
వివిధప్రాణిలలాట లేఖన మహావిద్యాను సంధాతకున్.
            దేవతలపాలిటి శత్రువు అయిన హిరణ్యకశిపుడు అప్పుడు, సరస్వతీ దేవీ హృదయాధిపతియు, ఆనందమును ఇచ్చువాడును, భక్తులను కాదనక కాపాడువాడును, మంచి తాపసులకు మించిన వరాలిచ్చువాడును. లోకాలను పుట్టించిన వాడును, సకల ప్రాణుల నుదుటివ్రాతను వ్రాసేవాడును అయిన బ్రహ్మదేవుడికి నమస్కరించాడు.
७-८५-मत्तेभ विक्रीडितमु
दिविजानीकविरॉधि म्रोक्केँ, गनि वाग्देवीमनोनेतकुन
सविशॅषोत्सव संविधातकु, नमत्संत्रातकुन, सत्तपो
निवहाभीष्टवरप्रदातकु, जगन्निर्मातकुन, धातकुन,
विविधप्राणिललाट लेखन महाविद्यानु संधातकुन.
          దివిజానీకవిరోధి = హిరణ్యకశిపుడు {దివిజానీకవిరోధి - దివిజ (దేవతా) అనీక (సేనల) కు విరోధి (శత్రువు), హిరణ్యకశిపుడు}; మ్రొక్కెన్ = నమస్కరించెను; వాగ్దేవీమనోనేత = బ్రహ్మదేవుని {వాగ్దేవీమనోనేత - వాగ్దేవి (సరస్వతీ దేవి)యొక్క మనస్ (మనస్సున) కు నేత (ప్రభువు), బ్రహ్మ}; కున్ = కి; సవిశేషోత్సవసంవిధాత = బ్రహ్మదేవుని {సవిశేషోత్సవసంవిధాత - సవిశేష (విశిష్టలతోకూడిన) ఉత్సవ (సంతోషమును) సంవిధాత (చక్కగాకలిగించెడివాడు), బ్రహ్మ}; కున్ = కి; నమత్సంత్రాత = బ్రహ్మదేవుడు {నమత్సంత్రాత - నమత్ (మ్రొక్కువారిని) సంత్రాత (చక్కగాకాపాడువాడు), బ్రహ్మ}; కున్ = కి; సత్తపోనివహాభీష్టవరప్రదాత = బ్రహ్మదేవుని {సత్తపోనివహాభీష్టవరప్రదాత - సత్ (మంచి, సత్యమైన) తపః (తపస్వుల) నివహా (సమూహముల) అభీష్ట (కోరిన) వర (వరములను) ప్రధాత (ప్రసాదించువాడు), బ్రహ్మ}; కున్ = కి; జగన్నిర్మాత = బ్రహ్మదేవుని {జగన్నిర్మాత - జగత్తును నిర్మాత (సృష్టించినవాడు), బ్రహ్మ}; కున్ = కి; ధాత = బ్రహ్మదేవుని; కున్ = కి; వివిధప్రాణిలలాటలేఖనమహా విద్యానుసంధాతకున్ = బ్రహ్మదేవుని {వివిధప్రాణిలలాటలేఖనమహావిద్యాను సంధాత - వివిధ(అఖిలమైన) ప్రాణి (జీవుల) లలాట(నొసటి) లేఖన (వ్రాయుటయందు)మహా(గొప్ప) విద్యా (విద్యను) అనుసంధాత(కలిగినవాడు), బ్రహ్మ}; కున్ = కి.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: