Tuesday, June 9, 2015

నారాయణుని వైషమ్య అభావం - జననాయక

7-8-కంద పద్యము
నాయక! యీ యర్థము
యశుఁ డగు ధర్మజునకుఁ గ్రతుకాలమునన్
మును నారదుండు చెప్పెను
వినిపించెద వినుము చెవులు విమలత నొందన్.
          జనులందరిని సరైన మార్గంలో నడిపించే ఓ పరీక్షిన్మహారాజా! ఇప్పుడు నీవడిగిన సంగతినే పూర్వం ధర్మవిదుడైన ధర్మరాజునకు రాజసూయ యాగ సమయంలో ధర్మవిదుడైన నారదమహర్షి చెప్పాడు. ఇప్పుడు నీకు చెప్తాను చెవులకు పండువుగా విను,
७-८-कंद पद्यमु
जननायक! यी यर्थमु
घनयशुँ डगु धर्मजुनकुँ ग्रतुकालमुनन
मुनु नारदुंडु चेप्पेनु
विनिपिंचेद विनुमु चेवुलु विमलत नोंदन.
            జననాయక = రాజా {జననాయక - జనులకు నాయకుడు, రాజు}; = ఇట్టి; అర్థము = సందర్భమునందు; ఘన = గొప్ప; యశుడు = కీర్తిగలవాడు; అగు = అయిన; ధర్మరాజున్ = ధర్మరాజున; కున్ = కు; క్రతు = యజ్ఞ; కాలమునన్ = సమయమునందు; మును = పూర్వము; నారదుండు = నారదుడు; చెప్పెను = తెలియజెప్పెను; వినిపించెదన్ = చెప్పెదను; వినుము = వినుము; చెవులు = చెవులు; విమలతన్ = నిర్మలత్వమును; ఒందన్ = పొందునట్లుగా.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: