Sunday, June 7, 2015

ననారాయణుని వైషమ్య అభావం - చిత్రంబులు

7-6-కంద పద్యము
చిత్రంబులు త్రైలోక్య ప
విత్రంబులు భవలతాలవిత్రంబులు స
న్మిత్రంబులు మునిజన వన
చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్.
          విష్ణు కథలు బహు చిత్ర మైనవి. చక్కటి చిత్రాలలా మనసులను రంజింపజేసేవి. ముల్లోకాలకు పవిత్రతను ఇచ్చేవి. కొడవళ్ళు తీగెలను కత్తిరించినంత అవలీలగా సంసార బంధాలను ఛేదించేవి. అఖిల జీవరాశికి ఆప్తమిత్రములైనవి. వనాలను వసంతాలు వికసింపజేసినట్లు, మునులను అలరింపజేసేవి.
7-6-kaMda padyamu
chitraMbulu trailOkya pa
vitraMbulu bhavalataalavitraMbulu sa
nmitraMbulu munijana vana
chaitraMbulu viShNudEvu chaaritraMbul.
            చిత్రంబులు = ఆశ్చర్యకమైనవి, మనోజ్ఞమైనవి {చిత్రము - చిత్తమును రమింపజేయునవి, మనోజ్ఞములు}; త్రైలోక్య = ముల్లోకములను {త్రిలోకములు - మూడులోకములు, 1భూలోకము 2ఊర్థ్వలోకములు 3అధోలోకములు}; పవిత్రంబులు = పవిత్రముజేయునవి; భవ = సాంసారపు; లతా = తీగలనెడిబంధనములను; లవిత్రంబులు = కొడవళ్ళవలెఖండించునవి; సత్ = మంచి; మిత్రంబులు = మిత్రులవంటివి; ముని = మునుల; జన = సమూహముయనెడి; వన = అడవికి; చైత్రంబులు = చైత్రమాసమువలె అలరించునవి; విష్ణు = విష్ణుమూర్తియనెడి; దేవు = దేవునియొక్క; చారిత్రంబులు = కథలు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: