Monday, April 6, 2015

కృష్ణలీలలు

10.1-342-మత్తేభము
యో! వైష్ణవ మాయయో! యితర సంల్పార్థమో! సత్యమో!
లఁపన్ నేరక యున్నదాననొ! యశోదాదేవిఁ గానో! పర
స్థమో! బాలకుఁడెంత? యీతని ముఖస్థంబై యజాండంబు ప్ర
జ్వమై యుండుట కేమి హేతువొ! మహాశ్చర్యంబు చింతింపఁగన్
          కొడుకు నోటిలో బ్రహ్మాండం చూసి విభ్రాంతురాలైన యశోద ఇలా అనుకోసాగింది
          నేను కలగనటం లేదు కదా? లేకపోతే ఇదంతా విష్ణుమాయేమో? ఇదంతా నా చిత్తభ్రమా? కాకపోతే ఇదే సత్యమా? ఒకవేళ నా బుద్ధి సరిగా పనిచేయటం లేదా? అసలు నేను యశోదను అవునా కాదా? ఇది అసలు మా ఇల్లేనా మరొటా? ఈ పిల్లాడు ఎంత, వీడి నోటిలో బ్రహ్మాండం అంతా వెలుగులు చిమ్ముతూ ఉండటం ఏమిటి? ఇలా ఎలా సాధ్యం? ఆలోచించేకొద్దీ ఇదంతా మహా ఆశ్చర్యంగా ఉంది.   
10.1-342-mathethebhamu
kalayO! vaiShNava maayayO! yitara saMkalpaarthamO! satyamO!
talaM~pan nEraka yunnadaanano! yashOdaadEviM~ gaanO! para
sthalamO! baalakuM~DeMta? yeetani mukhasthaMbai yajaaMDaMbu pra
jvalamai yuMDuTa kEmi hEtuvo! mahaashcharyaMbu chiMtiMpaM~gan
          కలయో = స్వప్నమా; వైష్ణవ = విష్ణుమూర్తి యొక్క; మాయయో = మాయా; ఇతరసంకల్పార్థమో = అసత్యమా, చిత్తభ్రమా {ఇతరసంకల్పార్థము - సరికాని ఆలోచనలవలన కలిగినది, అసత్యము, చిత్తభ్రమ}; సత్యమో = వాస్తవమా; తలపన్ = విచారించ; నేరక = లేక; ఉన్నదాననొ = ఉన్నానేమో; యశోదాదేవిన్ = నేనసలు యశోదాదేవిని; కానో = కాదేమో; పరస్థలమో = ఇతరమైన; స్థలమో = ప్రదేశమేమో (ఇది); బాలకుడు = పిల్లవాడు; ఎంత = ఎంతటివాడు; ఈతని = అతని యొక్క; ముఖస్థంబు = ముఖమునం దున్నది; = అయిన; అజాండంబు = విశ్వము; ప్రజ్వలము = మిక్కలి ప్రకాశిస్తున్నది; = అయ్యి; ఉండుట = ఉండుట; కున్ = కు; ఏమి = ఏమి; హేతువో = కారణమో; మహా = గొప్ప; ఆశ్చర్యంబు = వింత; చింతింపగన్ = విచారించగా.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

No comments: