Wednesday, April 29, 2015

కృష్ణలీలలు

10.1-377-సీస పద్యము
తోయంబు లివి యని తొలగక చొచ్చెదు; లఁచెదు గట్టైనఁ రల నెత్త;
మంటితో నాటలు మానవు; కోరాడె; దున్నత స్తంభంబు లూఁపఁ బోయె;
న్యుల నల్పంబు డుగంగఁ బాఱెదు; రాచవేఁటలఁ జాల వ్వఁదెచ్చె;
లయవు నీళ్ళకు డ్డంబు గట్టెదు; ముసలివై హలివృత్తి మొనయఁ; జూచె
10.1-377.1-ఆటవెలది
దంబరంబు మొలకు డుగవు తిరిగెద
వింకఁ గలికి చేఁత లేల పుత్ర!
నిన్ను వంప వ్రాల్చ నే నేర ననియొ నీ
విట్టు క్రిందు మీఁదు నెఱుఁగ కునికి.
10.1-378-వచనము
అని మర్మంబు లెత్తి పలికి.
            రే కన్నయ్యా! అల్లరి పిల్లాడా! అదురు బెదురు లేకుండా నీళ్ళలో చొరబడి పోతావు! (మత్యావతారుడవుగా నీళ్ళల్లో తిరిగావు కదా). ఎంత పెద్ద బండైనా ఎత్తేయాలని చూస్తావు! (కూర్మావతారుడవుగా మందరప్రవతాన్నే ఎత్తావు కదా). పరాయి వాళ్ళ దగ్గర అల్ప మైన వాటికోసం చెయ్యి చాస్తావు! (వామనాతారుడవుగా రాక్షసచక్రవర్తి బలివద్ద చెయ్యిచాపావు కదా). నీకు రాజసం ఎక్కువ ఎన్నో జగడాలు తెస్తావు! (పరశురామావతారుడవుగా రోజలోకాన్ని సంహరించావు కదా). నీళ్ళ ప్రవాహానికి అడ్డకట్టలు వేయాలని చూస్తావు! (రామావతారుడవు సముద్రానికే సేతువు కట్టావు కదా). దుడ్డుకర్ర పట్టుకొని నాగలిదున్నే వాడిలా నటిస్తావు! (బలరామావాతారుడవుగా ముసలము పట్టావు కదా). మొలకు గుడ్డ లేకుండా దిగంబరంగా తిరుగుతావు! (బుద్ధావతారుడవుగా సన్యాసిగా ప్రకాశించావు కదా). ఇవి చాలవు నట్లు ఇంకా దుడుకు చేష్ట లెందుకు చేస్తావో ఏమిటో? (ఇక ముందు కల్కి అవతార మెత్తి దుష్టులను శిక్షించడానికి ఏవేం చేస్తావో). నిన్ను నేను భయభక్తులలో పెట్టలేను అనుకునేగా ఇలా కింద మీద తెలియకుండ మిడిసిపడు తున్నావు! (త్రివిక్రమావతారుడవుగా బ్రహ్మాండభాండందాటి ఎదిగిపోయావు కదా).
          ఇలా ఎత్తిపొడుపు మాటలతో తల్లి యశోదాదేవి కొంటెకొడుకును దెప్పుతోంది.         
          చమత్కారమైన అలంకారం నిందాస్తుతి. ఓ ప్రక్కన నిందిస్తున్నా, స్తుతి పలుకుతుంటే నిందాస్తుతి అంటారు.  ఇలా అల్లరి కృష్ణబాలుని యశోద దెప్పటంలో నిందాస్తుతితో బహు చక్కగా అలరించారు మన పోతన్నగారు. ఆస్వాదిద్దాం రండి.  
10.1-377-seesa padyamu
tOyaMbu livi yani tolagaka chochchedu; talaM~chedu gaTTainaM~ darala netta;
maMTitO naaTalu maanavu; kOraaDe; dunnata staMbhaMbu looM~paM~ bOye;
danyula nalpaMbu laDugaMgaM~ baaRredu; raachavEM~TalaM~ jaala RravvaM~dechche;
dalayavu neeLLaku naDDaMbu gaTTedu; musalivai halivRitti monayaM~; jooche
10.1-377.1-aaTaveladi
daMbaraMbu molaku naDugavu tirigeda
viMkaM~ galiki chEM~ta lEla putra!
ninnu vaMpa vraalcha nE nEra naniyo nee
viTTu kriMdu meeM~du neRruM~ga kuniki.
10.1-378-vachanamu
ani marmaMbu letti paliki.
          తోయంబులు = నీళ్ళు; ఇవి = ఇవి; అని = అని; తొలగక = తప్పుకొనక; చొచ్చెదు = ప్రవేశించెదు (మత్యావతార సూచన); తలచెదు = ప్రయత్నించెదవు; గట్టైనన్ = కొండనైన; తరలనెత్తన్ = లేవనెత్తుటకు (కూర్మావతార సూచన); మంటితోన్ = మట్టితో; ఆటలు = ఆటలాడుట; మానవు = వదలవు; కోరాడెదు = గుచ్చియెత్తదవు (వరాహావతార సూచన); ఉన్నత = ఎత్తైన; స్తంభంబులున్ = స్తంభములను; ఊపబోయెదు = ఊపుటకుపోయెదవు (నరసింహావతార సూచన); అన్యులన్ = పరులను; అల్పంబులు = చిన్నవి; అడుగన్ = అర్థించుటకు; పాఱెదు = వెళ్ళెదవు (వామనావతార సూచన); రాచ = పెద్ద (రాజులను); వేటలన్ = పేటలందు (వేటాడుటందు); చాలన్ = మిక్కిలి; ఱవ్వ = అపకీర్తి (గొడవలు); తెచ్చెదు = తీసుకొచ్చెదవు (పరశురామావతార సూచన); అలయవు = అలసటన్నది లేదు; నీళ్ళు = జలముల; కున్ = కు; అడ్డంబున్ = కట్టను; కట్టెదు = కట్టుదువు (రామావతార చూచన); ముసలివి = వయసుమీరినవాడవు (ముసలము ధరించినవాడవు); = అయ్యి; హలి = రైతువలె (ఙలధారివి); వృత్తిన్ = వలె; మొనయజూచెదు = ప్రవేశింపచూచెదవు (బలరామావతార సూచన); అంబరంబున్ = బట్టలు.
          మొలకున్ = మొలకికట్టుకొనుటకు; అడుగవు = కోరవు (బౌద్ధావతార సూచన); తిరిగెదవు = నడచెదవు; ఇంకన్ = మళ్ళీ; కలికి = జగడపు; చేతలు = పనులు; ఏలన్ = ఎందుకు (కల్క్యవతార సూచన); పుత్ర = కొడుకా; నిన్నున్ = నిన్ను; వంపన్ = వంచుటకు; వ్రాల్చన్ = అణచుటకు; నేన్ = నేను; నేరను = అసమర్థురాలను; అనియొ = అనా; నీవు = నీవు; ఇట్టు = ఇలా; కిందుమీదున్ = కిందమీద; ఎఱుగకున్ = తెలియకవర్తించుట (అలక్ష్యమున); కిన్ = కుకారణము.
          అని = అని; మర్మంబులు = ఎత్తిపొడుపు మాటలు, పెడసరి మాటలు; ఎత్తి = ఎత్తిపొడిచి; పలికి = అని.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

No comments: