Tuesday, April 28, 2015

కృష్ణలీలలు

10.1-376-కంద పద్యము
క్కడనైనను దిరిగెద;
వొక్క యెడన్ గుణము గలిగి యుండవు; నియమం
బెక్కడిది నీకు? మఱచినఁ
క్కగఁ బోయెదవు పెక్కు జాడలఁబుత్రా!
            కన్నా! ఎక్కడబడితే అక్కడ తిరుగుతూ ఉంటావు. ఒకచోట కుదురుగా, బుద్ధి కలిగి ఉండవు కదా. నీకు పద్దతి ప్రకారం ఉండటం అంటూ లేదా ఏమిటి? ఒక్క క్షణం ఏమరుపాటు చెందితే చాలు ఎన్నివేషాలైనా వెసి, ఎక్కడికైనా పోతావురా కొడుకా!.
            ఇలా యశోదాదేవి తన కొడుకు కృష్ణుని దెబ్బలాడుతూంటే కూడా తత్వమే కనబడుతోందిట. భగవంతుడవు సర్వాంతర్యామివి, ఎక్కడైనా తిరుతావు. గుణాతీతుడవు, నీవు బుద్ధికలిగి కూర్చోడం ఏమిటి? సర్వోన్నతుడవు నియమాలు ఎవరు పెట్టగలరు? ఈ ఎరుక మరచి ఒక్క క్షణం ఏమరుపాటు చెందితే చాలు. మిత్రులు, శత్రులు మొదలైన అనేకంగా కనిపిస్తావు కదయ్యా!”   . . . అవును ఆత్మావైపుత్రా అంటారు పెద్దలు.
10.1-376-kaMda padyamu
ekkaDanainanu dirigeda;
vokka yeDan guNamu galigi yuMDavu; niyamaM
bekkaDidi neeku? maRrachinaM~
jakkagaM~ bOyedavu pekku jaaDalaM~butraa!
          ఎక్కడన్ = ఎక్కడను; ఐనన్ = అయినను; తిరిగెదవు = సంచరించెదవు; ఒక్క = ఏదోఒక; యెడన్ = చోట; గుణము = బుద్ధి; కలిగి = కలిగి; ఉండవు = ఉండవు; నియమంబు = కట్టుబాటు; ఎక్కడిది = అసలులేదు; నీకున్ = నీకు; మఱచినన్ = ఆదమరచినచో; చక్కగన్ = చక్కగా; పోయెదవు = వెళ్ళిపోయెదవు; పెక్కు = అనేకమైన; జాడలన్ = దార్లమ్మట; పుత్రా = కొడుకా.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

No comments: