Friday, April 17, 2015

కృష్ణలీలలు - కడుపారం

10.1-359-మత్తేభ విక్రీడితము
డుపారం జనుబాలు ద్రావని సుతుం గంజాక్షి పీఠంబుపై
నిడి పొంగారెడు పాలు డించుటకుఁనై యేగంగఁ దద్బాలుఁ డె
క్కుడు కోపంబున వాఁడిఱాత దధిమత్కుంభంబుఁ బోగొట్టి తెం
రం గుంభములోని వెన్నఁ దినె మిథ్యా సంకులద్బాష్పుఁడై.
              కవ్వం పట్టుకున్న చిన్నారి కృష్ణునికి యశోదాదేవి పాలు ఇస్తూ, పొయ్యిమీది పాలు పొంగిపోతున్నాయి అని చూసింది. అతను పాలు తాగటం పూర్తికాకుండానే పీటమీదకి దింపేసింది. పాలకుండ దింపడానికి గబగబా లోపలికి వెళ్ళింది. తన కడుపు నిండకుండా మధ్యలో వెళ్ళిందని కోపంతో  వాడిరాతితో నిండుగా ఉన్న పెరుగుకుండను పగులగొట్టాడు. పగిలిన కుండలోని వెన్నను తినసాగాడు. పైపెచ్చు దొంగకన్నీళ్లు కారుస్తూ ఏడవటం మొదలెట్టాడు.
10.1-359-mattEbha vikreeDitamu
kaDupaaraM janubaalu draavani sutuM gaMjaakShi peeThaMbupai
niDi poMgaareDu paalu DiMchuTakuM~nai yEgaMgaM~ dadbaaluM~ De
kkuDu kOpaMbuna vaaM~DiRraata dadhimatkuMbhaMbuM~ bOgoTTi teM
paDaraM guMbhamulOni vennaM~ dine mithyaa saMkuladbaaShpuM~Dai.
            కడుపారన్ = కడుపునిండా; చనుబాలు = తల్లి పాలు; త్రావని = తాగుట పూర్తిచేయని; సుతున్ = పుత్రుని; కంజాక్షి = పద్మాక్షి, యశోదాదేవి; పీఠంబు = పీట; పైన్ = మీద; ఇడి = పెట్టి, ఉంచి; పొంగారెడు = పొంగిపోతున్న; పాలున్ = పాలను; డించుట = పొయ్యిమీంచి దింపుట; కున్ = కోసము; = అయి; ఏగంగన్ = వెళ్ళగా; తత = ; బాలుడు = పిల్లవాడు; ఎక్కుడు = అధికమైన; కోపంబునన్ = కోపంతో; వాడి = సూదిగా ఉన్న; ఱాతన్ = రాయితో; దధిమత్కుంభంబున్ = పెరుగుతో నిండుగానున్న కుండను; పోగొట్టి = పగులగొట్టి; తెంపు = పెంకితనము; అడరన్ = పెరిగిపోగా; కుంభము = కుండ; లోని = అందలి; వెన్నన్ = వెన్నను; తినెన్ = తిన్నాడు; మిథ్యా = దొంగ, అబద్ధమైన; సంకులత్ = కారుతున్న; భాష్పుడు = కన్నీరు కలవాడు; = అయ్యి.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

No comments: