Thursday, April 16, 2015

కృష్ణలీలలు - కవ్వము

10.1-358-కంద పద్యము
వ్వముఁ బట్టిన ప్రియసుతు
వ్వనరుహనేత్ర దిగిచి యంకతలమునన్
వ్వుచు నిడుకొని కూఁకటి
దువ్వుచుఁ జన్నిచ్చె; నతఁడు దూఁటుఁచుఁ గుడిచెన్.
            యశోదాదేవి కవ్వం పట్టుకున్న తన కొడుకు కృష్ణుడిని నవ్వుతూ దగ్గరకు తీసుకుంది. ఒళ్లో కూర్చుండ బెట్టుకుంది. ప్రేమగా జుట్టు దువ్వుతూ అతనికి పాలు ఇవ్వసాగింది. నల్లనయ్య చక్కగా తల్లిరొమ్ములో తలదూర్చి తాగుతున్నాడు.
10.1-358-kaMda padyamu
kavvamuM~ baTTina priyasutu
navvanaruhanEtra digichi yaMkatalamunan
navvuchu niDukoni kooM~kaTi
duvvuchuM~ jannichche; nataM~Du dooM~TuM~chuM~ guDichen.
           కవ్వమున్ = కవ్వమును; పట్టిన = పట్టుకొనిన; ప్రియ = ముద్దుల; సుతున్ = పుత్రుని; = ; వనరుహనేత్ర = సుందరి {వనరుహనేత్ర - వనరుహ (పద్మములవంటి) నేత్రములు కలామె, స్త్రీ}; తిగిచి = తీసుకొని; అంకతలమునన్ = ఒడిలో; నవ్వుతున్ = నవ్వుతూ; ఇడుకొని = ఉంచుకొని; కూకటిన్ = జుట్టుపిలక; దువ్వుచున్ = దువ్వుతూ; చన్ను = చనుబాలు; ఇచ్చెన్ = ఇచ్చెను; అతడున్ = అతను; దూటుచున్ = పీల్చుచు; కుడిచెన్ = తాగెను.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

No comments: