Wednesday, April 1, 2015

కృష్ణలీలలు

10.1-335-వచనము
అంత నొక్కనాడు బలభద్రప్రముఖులైన గోపకుమారులు వెన్నుండు మన్ను దినె నని చెప్పిన యశోద బాలుని కేలు పట్టుకొని యిట్లనియె.
           ఒక రోజున బలరాముడు మొదలైన యాదవ బాలురు కష్ణుడు మట్టి తిన్నాడు అని యశోదాదేవికి చెప్పారు. అంత ఆ అమాయకపు తల్లి ఆ నెరదంట పాపడిని చెయ్యి పట్టుకొని గదమాయిస్తోంది.
10.1-335-vachanamu
aMta nokkanaaDu balabhadrapramukhulaina gOpakumaarulu vennuMDu mannu dine nani cheppina yashOda baaluni kElu paTTukoni yiTlaniye.
          అంతన్ = అప్పుడు; ఒక్క = ఒకానొక; నాడున్ = దినమున; బలభద్ర = బలరాముడు; ప్రముఖులు = మున్నగువారు; ఐన = అయిన; గోప = యాదవ; కుమారులు = పిల్లలు; వెన్నుండు = కృష్ణుడు {వెన్నుడు (వి) - విష్ణువు (ప్ర)}; మన్ను = మట్టిని; తినెను = తిన్నాడు; అని = అని; చెప్పినన్ = చెప్పగా; యశోద = యశోద; బాలుని = పిల్లవానిని; కేలు = చేయి; పట్టుకొని = పట్టుకొని; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

No comments: