Tuesday, March 17, 2015

కృష్ణలీలలు

10.1-290-కంద పద్యము
వాడిరి బలకృష్ణులు
వాడిరి వారిఁ జూచి గ రంభాదుల్
వాడి రరులు భయమునఁ
వాడిరి మంతనములఁ పసులు వేడ్కన్.
         బాల్యక్రీడలలో బలరామ కృష్ణులు ఆలా ఎంతోసేపు ఆడుతుంటే చూసి, రంభ మొదలైన అప్సరసలు ఆకాశంలో ఆనందంగా ఆడుతున్నారు. అరిషడ్వర్గం అనే శత్రువులు పెచ్చుమీరినవారు దుర్మార్గులు. వారు భయంతో తడబడ్డారు. ఋషులు లోకానికి మంచి దనే సంతోషంతో రహస్యంగా ముచ్చట్లలో ఓలలాడారు.
10.1-290-kaMda padyamu
taDa vaaDiri balakRiShNulu
daDa vaaDiri vaariM~ joochi taga raMbhaadul
daDavaaDi rarulu bhayamunaM~
daDa vaaDiri maMtanamulaM~ dapasulu vEDkan.
          తడవు = చిరకాలం; డిరి = క్రీడించిరి; బల = బలరాముడు; కృష్ణులున్ = కృష్ణుడు; తడవు = కొంతసేపు; ఆడిరి = నాట్యము లాడిరి; వారిన్ = వారిని; చూచి = చూసి; తగన్ = తగినట్లుగ; రంభ = రంభ; ఆదుల్ = మున్నగువారు; తడవాడిరి = తడబడిరి; అరులు = శత్రువులు; భయమునన్ = భీతిచేత; తడవు = చాలాసేపు; ఆడిరి = మాట్లాడుకొనిరి; మంతనములన్ = రహస్యముగా; తపసులు = ఋషులు; వేడ్కన్ = కుతూహలముతో.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

No comments: