Saturday, January 31, 2015

రుక్మిణీకల్యాణం - హరి యీ తెఱగున

108- క.
రి యీ తెఱఁగున రుక్మిణి
రుదుగఁ గొనివచ్చి పెండ్లియాడుట విని దు
ష్కకృత్య మనుచు వెఱగం
దిరి రాజులు రాజసుతులు దిక్కుల నెల్లన్.
          ముకుందుడు శ్రీకృష్ణుడు రుక్మణీదేవిని అపూర్వంగా తీసుకొచ్చి యిలా వివాహమాడిన విధము, బహు దుస్సాధ్య మైన విషయం అనుచు ప్రపంచంలోని రాజులు, రాకుమారులు, అందరు అచ్చరువొందారు. అంటు పరీక్షిత్తునకు శుకుడు చెప్పసాగాడు.
108- ka.
hari yee teRraM~guna rukmiNi
narudugaM~ gonivachchi peMDliyaaDuTa vini du
ShkarakRitya manuchu veRragaM
diri raajulu raajasutulu dikkula nellan.
          హరి = కృష్ణుడు; = ; తెఱగునన్ = విధముగ; రుక్మిణిన్ = రుక్మిణీదేవిని; అరుదుగన్ = అద్భుతముగా; కొనివచ్చి = తీసుకొచ్చి; పెండ్లి = వివాహము; ఆడుట = చేసికొనుట; విని = విని; దుష్కర = అసాధ్యమైన; కృత్యము = పని; అనుచు = అని; వెఱగందిరి = ఆశ్చర్యపడిరి; రాజులున్ = రాజులు; రాజసుతులున్ = రాకుమారులు; దిక్కులన్ = అన్ని వైపుల ఉన్నవారు; ఎల్లన్ = అందరును.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం: :

Friday, January 30, 2015

రుక్మిణీకల్యాణం - హరి పెండ్లికి

107- క.
రి పెండ్లికిఁ గైకేయక
కురు సృంజయ యదు విదర్భ కుంతి నరేంద్రుల్
మానందముఁ బొందిరి
ణీశులలోన గాఢతాత్పర్యమునన్.
          శ్రీకృష్ణమూర్తి కల్యాణానికి, రాజు లందరి లోను కేకయ, కురు, సృంజయ, యదు, విదర్భ, కుంతి దేశాల రాజులు అధికమైన పరమానందం పొందారు.
107- ka.
hari peMDlikiM~ gaikEyaka
kuru sRiMjaya yadu vidarbha kuMti narEMdrul
paramaanaMdamuM~ boMdiri
dharaNeeshulalOna gaaDhataatparyamunan.
          హరి = కృష్ణుని; పెండ్లి = వివాహమున; కిన్ = కు; కైకేయ = కైకేయ వంశపు; కురు = కురు వంశపు; సృంజయ = సృంజయ వంశపు; యదు = యదు వంశపు; విదర్భ = విదర్భ దేశపు; కుంతి = కుంతి భోజుని వంశపు; నరేంద్రులు = రాజులు; పరమ = అధికమైన; ఆనందమున్ = సంతోషమును; పొందిరి = పొందిరి; ధరణీశుల = రాజుల {ధరణీశుడు - ధరణి (భూమికి) ఈశుడు (ప్రభువు), రాజు}; లోనన్ = అందలి; గాఢ = దృఢమైన; తాత్పర్యమునన్ = మంచి అభిప్రాయముతో.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం: :

Thursday, January 29, 2015

రుక్మిణీకల్యాణం - సతులుం దారును

106- క.
తులుం దారును బౌరులు
హిమతిఁ గానుకలు దెచ్చి యిచ్చిరి కరుణో
న్న వర్ధిష్ణులకును మా
ని రోచిష్ణులకు రుక్మిణీకృష్ణులకును.
          అపార కృపా వర్ధిష్ణులు, అఖండ తేజో విరాజితులు రుక్మిణీ శ్రీకృష్ణులకు ద్వారకాపుర వాసులు తమ భార్యలతో వచ్చి మనస్పూర్తిగా కానుకలు తెచ్చి ఇచ్చారు.
106- ka.
satuluM daarunu baurulu
hitamatiM~ gaanukalu dechchi yichchiri karuNO
nnata vardhiShNulakunu maa
nita rOchiShNulaku rukmiNeekRiShNulakunu.
          సతులున్ = భార్యలు; తారునున్ = తాముకలిసి; పౌరులు = పురజనులు; హితమతిన్ = ఇష్టపూర్వకముగా; కానుకలున్ = బహుమతులు; తెచ్చి = తీసుకొచ్చి; ఇచ్చిరి = ఇచ్చిరి; కరుణ = దయచేత; ఉన్నత = గొప్ప వహించిన; వర్ధిష్ణుల్ = వృద్ధి పొందు గుణము కల వారి; కును = కు; మానిత = మన్నింపదగిన; రోచిష్ణుల = ప్రకాశవంత స్వభావము గల వారి; కున్ = కి; రుక్మిణీ = రుక్మిణీదేవి; కృష్ణుల = కృష్ణుడుల; కును = కు.

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం: :

Wednesday, January 28, 2015

రుక్మిణీకల్యాణం - ధ్రువకీర్తిన్


105- మ.
ధ్రుకీర్తిన్ హరి పెండ్లియాడె నిజ చేతోహారిణిన్ మాన వై
గాంభీర్య విహారిణిన్ నిఖిల సంత్కారిణిన్ సాధు బాం
సత్కారిణిఁ బుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణిన్
సువిభూషాంబర ధారిణిన్ గుణవతీచూడామణిన్ రుక్మిణిన్.
          రుక్మిణీదేవి ఆత్మోన్నత్యం, మహావైభవం, గాంభీర్యాలతో మెలగుతుంది. సకల సంపదలు కలిగిస్తుంది. సాధువులను బంధువులను చక్కగ సత్కరిస్తుంది. పుణ్యకార్యాలు చేస్తుంది, మహాదరిద్రాన్ని పోగొడు తుంది. చక్కటి భూషణాలు వస్త్రాలు ధరించిన, అలాంటి సుగుణాల నారీ శిరోమణి, తన మనోహారి యైన రుక్మణిని ఆ శుభ సమయంలో వివాహమాడాడు. శాశ్వతమైన యశస్సు పొందాడు.
105- ma.
dhruvakeertin hari peMDliyaaDe nija chEtOhaariNin maana vai
bhava gaaMbheerya vihaariNin nikhila saMpatkaariNin saadhu baaM
dhava satkaariNiM~ buNyachaariNi mahaadaaridrya saMhaari Nin
suvibhooShaaMbara dhaariNin guNavateechooDaamaNin rukmiNin.
          ధ్రువ = శాశ్వతమైన; కీర్తిన్ = కీర్తితో; హరి = కృష్ణుడు; పెండ్లి = వివాహము; ఆడెన్ = చేసుకొనెను; నిజ = తన యొక్క; చేతః = మనసును; హారిణిన్ = అపహరించినామెను; మాన = చిత్తౌన్నత్యము; వైభవ = ఐశ్వర్యము; గాంభీర్య = నిబ్బరములు కలిగి; విహారిణిన్ = విహరించెడి ఆమెను; నిఖిల = సర్వ; సంపత్ = సంపదలను; కారిణిన్ = కలిగించెడి ఆమెను; సాధు = మంచివారిని; బాంధవ = బంధువులను; సత్కారిణిన్ = సత్కరించునామెను; పుణ్య = మంచి; చారిణిన్ = నడవడిక కలామెను; మహా = గొప్ప; దారిద్ర్య = పేదరికములను; సంహారిణిన్ = నశింపజేయు నామెను; సు = మంచి; విభూషా = ఆభరణములను; ధారిణిన్ = ధరించు నామెను; గుణవతీ = సుగుణవంతురాలలో; చూడామణిన్ = శ్రేష్ఠురాలును; రుక్మిణిన్ = రుక్మిణీదేవిని.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం: :

Tuesday, January 27, 2015

రుక్మిణీకల్యాణం - అంత న య్యాదవేంద్రుని

104- వ.
అంత న య్యాదవేంద్రుని నగరంబు సమారబ్ద వివాహ కృత్యంబును బ్రవర్తమాన గీత వాద్య నృత్యం బును, బ్రతిగృహాలంకృ తాశేష నరనారీ వర్గంబును, బరిణయ మహోత్సవ సమాహూయ మాన మహీపాల గజఘటా గండమండల దానసలిలధారా సిక్త రాజమార్గంబును బ్రతిద్వార మంగళాచార సంఘటిత క్రముక కదళికా కర్పూర కుంకుమాగరు ధూపదీప పరిపూర్ణకుంభంబును, విభూషిత సకల గృహవేదికా కవాట దేహళీ స్తంభంబును, విచిత్ర కుసుమాంబర రత్నతోరణ విరాజితంబును, సముద్ధూత కేతన విభ్రాజితంబును నై యుండె; నయవ్వసరంబున.
          అంతట ద్వారకానగరంలో పెళ్ళి పనులు మొదలయ్యాయి. పాటలు, వాయిద్యాలు, నాట్యాలు చెలరేగాయి. ప్రతి ఇంటి నిండా అలంకరించుకున్న స్త్రీ పురుషులు గుంపులు గూడుతున్నారు. కల్యాణ మహోత్సవానికి ఆహ్వానించబడిన ఎంతోమంది రాజులు వస్తున్నారు. వారి వారి ఏనుగుల గండభాగాల నుండి కారుతున్న మదజలంతో రాజమార్గాలు కళ్ళాపిజల్లినట్లు తడుస్తున్నాయి. ప్రతి ద్వారానికి రెండు పక్కల మంగళాచారంకోసం పోకమొక్కలు అరటిబోదెలు కట్టారు. కర్పూరం, కుంకుమ, అగరుధూపాలు, దీపాలు, పూర్ణకుంభాలు ఉంచారు. ఇంటి అరుగులు, తలుపులు, గడపలు, స్తంభాలు చక్కగా అలంకరించారు. రంగురంగుల పూలు, బట్టలు, రత్నాలుతో తోరణాలు కట్టారు. జండాలు ఎగరేసారు. అప్పుడు.
          అంతన్ = అటుపిమ్మట; = ఆ యొక్క; యాదవేంద్రుని = కృష్ణుని {యాదవేంద్రుడు - యాదవులలో ఉత్తముడు, కృష్ణుడు}; నగరంబు = పట్టణము; సమారబ్ద = ప్రారంభింపబడిన; వివాహ = పెండ్లి; కృత్యంబునున్ = పనులుకలది; ప్రవర్తమాన = జరుగుచున్న; గీత = పాటలుపాడుట; వాద్య = వాద్యములు వాయించుట; నృత్యంబున్ = నృత్యములాడుటలు కలది; ప్రతి = అన్ని; గృహ = ఇళ్ళలోను; అలంకృత = అలంకరింపబడిన; అశేష = ఎల్ల; నర = పురుషుల; నారీ = స్త్రీల; వర్గంబును = సమూహములు కలది; పరిణయ = పెండ్లి యొక్క; మహా = గొప్ప; ఉత్సవ = వేడుకకు; సమాహూయమాన = పిలువబడుచున్న; మహీపాల = రాజుల యొక్క; గజ = ఏనుగుల; ఘటా = సమూహము యొక్క; గండమండల = చెక్కిలి ప్రదేశములందలి; దాన = మద; సలిల = జల; ధారా = ధారలచేత; సిక్త = తడిసిన; రాజమార్గంబునున్ = ప్రధాన వీధులు కలది; ప్రతి = ఎల్ల; ద్వార = గుమ్మములందు; మంగళాచార = శుభకార్యమునకై; సంఘటిత = కట్టబడిన; క్రముక = పొకమానులు; కదళికా = అరటిచెట్లు; కర్పూర = కర్పూరము; కుంకుమ = కుంకుమ; అగరు = అగరు (సుగంధ ద్రవ్యము); ధూప = ధూపములు; దీప = దీపములు; పరిపూర్ణ = నిండు; కుంభంబును = కుంభములు కలది; విభూషిత = అలంకరింపబడిన; సకల = సమస్తమైన; గృహ = ఇండ్లయొక్క; వేదికా = అరుగులు; కవాట = తలుపులు; దేహళీ = ద్వారబంధములు; స్తంభంబును = స్తంభములు కలది; విచిత్ర = విశేషమైన; కుసుమ = పూలు; అంబర = వస్త్రములు; రత్న = మణులు; తోరణ = తోరణములచేత {తోరణము - వరుసగా కట్టిన ఆకులు పూలు వంటివి కట్టిన పొడుగైన తాడు}; విరాజితంబును = విలసిల్లుచున్నది; సముద్ధూత = మిక్కలిమీదికెగురుతున్న; కేతన = జండాలచేత; విభ్రాజితంబును = మిక్కలిప్రకాశించుచున్నది; ఐ = అయ్యి; ఉండెన్ = ఉండెను; ఆ = ఆ యొక్క; అవసరంబునన్ = సమయమునందు.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం: :