Saturday, December 6, 2014

రుక్మిణీకల్యాణం – బంధులగూడి

43- ఉ.
బంధులఁ గూడి కృష్ణబలద్రులు వచ్చినఁ బాఱదోలి ని
ర్మంథర వృత్తిఁ జైద్యునకు మానినిఁ గూర్చెద మంచు నుల్లస
త్సింధుర వీర రథ్య రథ సేనలతోఁ జనుదెంచి రా జరా
సంధుఁడు దంతవక్త్రుఁడును సాల్వ విదూరథ పౌండ్రకాదులున్.
          జరాసంధుడు, దంతవక్త్రుడు, సాల్వుడు, విదూరథుడు, పౌండ్రకుడు మొదలైన వాళ్ళంతా బలరామ కృష్ణులు బంధువు లందరను తోడు తెచ్చుకొని వచ్చినా సరే తరిమేస్తాం. శిశిపాలుడికి బాలికను తెచ్చి ఏ ఇబ్బంది లేకుండా కట్ట బెడతాం.” అంటూ చతురంగబలాలతో వచ్చారు.
43- u.
baMdhulaM~ gooDi kRiShNabalabhadrulu vachchinaM~ baaRradOli ni
rmaMthara vRittiM~ jaidyunaku maaniniM~ goorcheda maMchu nullasa
tsiMdhura veera rathya ratha sEnalatOM~ janudeMchi raa jaraa
saMdhuM~Du daMtavaktruM~Dunu saalva vidooratha pauMDrakaadulun.
          బంధులన్ = బంధువులతో; కూడి = కలిసి; కృష్ణ = కృష్ణుడు; బలభద్రులున్ = బలరాముడులు; వచ్చినన్ = వచ్చినచో; పాఱదోలి = తరిమేసి; నిర్మంథర = చొరవగల {నిర్మంథరము - మంథరము (చొరవలేనిది) లేకుండునది}; వృత్తిన్ = విధానములో; చైద్యున్ = శిశుపాలుని; కున్ = కి; మానిని = వనితను; కూర్చెదము = కలిపెదము; అంచున్ = అని; ఉల్లసత్ = ఉత్సహించుచున్న; సింధుర = ఏనుగుల; వీర = శూరులైన భటుల; రథ్య = అశ్వ; రథ = రథ; సేనల = సైనికదండు; తోన్ = తోటి; చనుదెంచిరి = వచ్చిరి; = ఆ యొక్క; జరాసంధుడు = జరాసంధుడు; దంతవక్త్రుడును = దంతవక్త్రుడు; సాల్వ = సాల్వుడు {సాల్వుడు - సాల్వదేశాధీశుడు}; విదూరథ = విదూరథుడు; పౌండ్రక = పౌండ్రకవాసుదేవుడు; ఆదులున్ = మొదలగువారు.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం  : :

No comments: