Friday, December 26, 2014

రుక్మిణీకల్యాణం - అళినీలాలక

69- మ.
ళినీలాలకఁ బూర్ణచంద్రముఖి, నేణాక్షిం, బ్రవాళా ధరిం,
కంఠిన్, నవపల్ల వాంఘ్రియుగళన్, గంధేభకుంభస్తనిం,
బులినశ్రోణి నిభేంద్రయాన, నరుణాంభోజాతహస్తన్, మహో
త్ఫగంధిన్, మృగరాజమధ్యఁ గని విభ్రాంతాత్ములై రందఱున్.
          తుమ్మెదల వంటి నల్లని ముంగురులు, పూర్ణ చంద్రుడు వంటి గుండ్రటి ముఖము, లేడి కన్నులు, పగడాల లాంటి పెదవులు, కోకిల కంఠధ్వని, కొంగ్రొత్త చిగురుల వంటి చేతులు, మదగజాల కుంభస్థలాల లాంటి స్తనాలు, ఇసుక తిన్నెల లాంటి పిరుదులు, దిగ్గజాల నడక లాంటి నడక, ఎర్రకలువ లాంటి అరచేతులు, గొప్ప పద్మాల వంటి సువాసనలు, సింహం నడుము కల ఆ రుక్మిణిని చూసి అందరు విభ్రాంతి చెందారు.
69- ma.
aLineelaalakaM~ boorNachaMdramukhi, nENaakShiM, bravaaLaa dhariM,
galakaMThin, navapalla vaaMghriyugaLan, gaMdhEbhakuMbha staniM,
bulina shrONi nibhEMdrayaana, naruNaaMbhOjaatahastan, mahO
tphalagaMdhin, mRigaraajamadhyaM~ gani vibhraaMtaatmulai raMdaRrun.
          అళి = తుమ్మెదలవలె; నీల = నల్లని; అలక = ముంగురుల గలామెను; పూర్ణ = నిండు; చంద్ర = చంద్రుని వంటి; ముఖిన్ = ముఖము కలామెను; ఏణా = లేడివంటి; ఆక్షిన్ = కన్నులు కలామెను; ప్రవాళ = పగడమువంటి; అధరన్ = కిందిపెదవి కలామెను; కల = కోకిల వంటి; కంఠిన్ = కంఠస్వరము కలామెను; నవ = లేత; పల్లవ = చిగురు వంటి; అంఘ్రి = పాదముల; యుగళన్ = జంట కలామెను; గంధ = మద; ఇభ = గజము యొక్క; కుంభ = కుంభస్థలముల వంటి; స్తనిన్ = కుచములు కలామెను; పులిన = ఇసుక తిన్నెల వంటి; శ్రోణిన్ = పిరుదులు కలామెను; ఇభ = ఏనుగు; ఇంద్ర = శ్రేష్ఠము వంటి; యానన్ = నడక కలామెను; అరుణ = ఎర్ర; అంభోజాత = కలువవంటి; హస్తన్ = చేతులు కలామెను; మహా = గొప్ప; ఉత్ఫల = పద్మముల వంటి; గంధిన్ = సువాసన కలామెను; మృగరాజ = సింహము వంటి {మృగరాజు - మృగములలో రాజు, సింహము}; మధ్యన్ = నడుము కలామెను; కని = చూసి; విభ్రాంత = మిక్కిలి చలించిన; ఆత్ములు = మనసు కలవారు; ఐరి = అయిరి; అందఱున్ = ఎల్లరు.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం: :

No comments: