Monday, December 15, 2014

రుక్మిణీకల్యాణం – మలఁగున్

54- వ.
మఱియును.    
55- మ.
లఁగున్ మెల్లని గాలికిం; బటునటన్మత్తద్విరేఫాళికిం
లఁగుం; గోయల మ్రోఁతకై యలఁగు; నుద్యత్కీర సంభాషలం
లఁగున్; వెన్నెలఁవేడిమిం నలఁగు; మాకందాంకురచ్ఛాయకుం
దొలఁగుం; గొమ్మ మనోభవానలశిఖాదోధూయ మానాంగియై.
          ఇంకా మన్మథతాపాగ్నిలో వేగిపోతున్న మగువ పిల్లగాలికి అలసి పోతుంది. దోగాడే తుమ్మెదలకి తొలగిపోతుంది. కోయిల కూసినా చిరాకు పడుతుంది. చక్కటి చిలక పలుకులకి ఉలికి పడుతుంది. వెన్నెల వేడికి వేగిపోతుంది. మామిడి చెట్టు నీడకి తప్పుకుంటుంది.
54- va.
maRriyunu.     
55- ma.
malaM~gun mellani gaalikiM; baTunaTanmatta dvirEphaaLikiM
dalaM~guM; gOyalamrOM~takai yalaM~gu; nudyatkeera saMbhaaShalaM
galaM~gun; vennelaM~vEDimiM nalaM~gu; maakaMdaaMkura chhaayakuM
dolaM~guM; gomma manObhavaanalashikhaadOdhooya maanaaMgiyai.
          మఱియును = ఇంతేకాకుండా.
          మలగున్ = చలించును; మెల్లని = మెల్లగా వీచెడి; గాలి = గాలి; కిన్ = కి; పటు = మిక్కలి; నటత్ = చరించుచున్న; ఉన్మత్త = మత్తుగొన్న; ద్విరేఫా = తుమ్మెదల {ద్విరేఫము - తన పేరైన భ్రమరమునందు రెండు రేఫలు (రవత్తులు) కలది, రేఫ (రవత్తు) వంటి రెక్కలు రెండు కలది, తుమ్మెద}; ఆళి = సమూహమున; కిన్ = కు; తలగున్ = తప్పుకొనును; కోయిల = కోకిల; మ్రోత = కూతల; కై = వలన; అలగున్ = చిరాకుపడును; ఉద్యత్ = పుట్టుచున్న; కీర = చిలుకల; సంభాషలం = పలుకులకు; కలగున్ = కలతపడును; వెన్నెల = వెన్నెల యొక్క; వేడిమిన్ = తాపమునకు; నలగున్ = బడలికచెందును; మాకంద = తియ్యమామిడి; అంకుర = చిగుర్ల; ఛాయకున్ = నీడకు; తొలగున్ = తప్పించుకొనిపోవును; కొమ్మ = ఇంతి; మనోభవ = మన్మథ {మనోభవ - మనసునందు పట్టువాడు, మన్మథుడు}; అనల = అగ్ని యొక్క; శిఖా = మంటలచేత; దోధూయమాన = చలింపజేయబడిన; అంగి = దేహము కలామె; = అయ్యి.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం  : :

No comments: