Sunday, December 14, 2014

రుక్మిణీకల్యాణం – మృగనాభి యలఁదదు

53- సీ.
మృగనాభి యలఁదదు మృగరాజమధ్యమ;
          లకము లాడదు లజగంధి;
ముకురంబు చూడదు ముకురసన్నిభముఖి;
          పువ్వులు దుఱుమదు పువ్వుఁబోఁడి;
నకేళిఁ గోరదు నజాతలోచన;
          హంసంబుఁ బెంపదు హంసగమన;
తలఁ బోషింపదు తికాలలితదేహ
          తొడవులు తొడువదు తొడవుతొడవు
ఆ.
తిలకమిడదు నుదుటఁ దిలకినీతిలకంబు
మలగృహముఁ జొరదు మలహస్త
గారవించి తన్నుఁ రుణఁ గైకొన వన
మాలి రాఁడు తగవుమాలి యనుచు.
          అన్యాయంగా కృష్ణుడు తనను ప్రేమతో కరుణించ డానికి రావటం లేదు అన్న తలపుల పరధ్యాన్నంలో పడి, ఆ సింహపు నడుము చిన్నది కస్తూరి రాసుకోడం లేదట. పద్మగంధం లాంటి మేని సువాసనలు గల పద్మగంధి జలకా లాడటం లేదట. అద్దం లాంటి మోముగల సుందరి అద్దం చూట్టం లేదట. పువ్వులాంటి సుకుమారి పువ్వులే ముడవటం లేదట. పద్మాల్లాంటి కళ్ళున్న పద్మాక్షి జలక్రీడకి వెళ్ళటం లేదట. హంస నడకల చిన్నది హంసలను చూట్టం లేదట. లత లాంటి మనోఙ్ఞమైన కోమలి లతలని చూట్టం లేదుట. అలంకారాలకే అలంకారమైన అందగత్తె అలంకారాలు చేసుకోవటం లేదుట.
          చక్కటిచుక్క లాంటి వనితాశిరోమణి బొట్టు పెట్టుకోటం లేదట. కమలాల లాంటి చేతులున్న సుందరి సరోవరాలలోకి దిగటం లేదట.
53- see.
mRiganaabhi yalaM~dadu mRigaraajamadhyama;
          jalakamu laaDadu jalajagaMdhi;
mukuraMbu chooDadu mukurasannibhamukhi;
          puvvulu duRrumadu puvvuM~bOM~Di;
vanakELiM~ gOradu vanajaatalOchana;
          haMsaMbuM~ beMpadu haMsagamana;
latalaM~ bOShiMpadu latikaalalitadEha
          toDavulu toDuvadu toDavutoDavu
aa.
tilakamiDadu nuduTaM~ dilakineetilakaMbu
gamalagRihamuM~ joradu kamalahasta
gaaraviMchi tannuM~ garuNaM~ gaikona vana
maali raaM~Du tagavumaali yanuchu.
          మృగనాభి = కస్తూరి; అలదదు = రాసుకొనదు; మృగరాజ = సింహమువంటి; మధ్యమ = నడుము కలామె; జలకములాడదు = స్నానము చేయదు; జలజ = పద్మములవంటి; గంధి = సువాసన కలామె; ముకురంబున్ = అద్దములో; చూడదు = చూసుకొనదు; ముకుర = అద్దము; సన్నిభ = లాంటి; ముఖి = మోము కలామె; పువ్వులున్ = పూలను; తుఱుమదు = తలలోపెట్టుకోదు; పువ్వు = పూలవంటి; పోడి = దేహము కలామె; వన = వనములలో; కేళిన్ = విహారములను; కోరదు = ఇష్టపడదు; వనజాత = పద్మము వంటి; లోచన = కన్నులు కలామె; హంసంబున్ = హంసలను; పెంపదు = సాకదు; హంస = హంసవంటి; గమన = నడక కలామె; లతలన్ = తీగలను; పోషింపదు = పెంచదు; లతికా = తీగవలె; లలిత = మనోజ్ఞమైన; దేహ = దేహము కలామె; తొడవులు = ఆభరణములను; తొడువదు = తొడుగుకొనదు, ధరించదు; తొడవు = భూషణములకే; తొడవు = భూషణప్రాయమైనామె.
          తిలకము = తిలకముబొట్టు; ఇడదు = పెట్టుకొనదు; నుదుటన్ = నుదురుమీద; తిలకినీ = స్త్రీలలో {తిలకిని - తిలకము ధరించునామె, స్త్రీ}; తిలకంబు = ఉత్తమురాలు; కమలగృహమున్ = చెరువులందు {కమలగృహము - పద్మములకు నిలయము, సరస్సు}; చొరదు = ప్రవేశింపదు; కమల = పద్మరేఖ; హస్త = చేతిలో కలామె; గారవించి = మన్నించి; తన్నున్ = ఆమెను; కరుణన్ = దయతోటి; కైకొనన్ = చేపట్టుటకు; వనమాలి = కృష్ణుడు {వనమాలి - వనమాల ధరించువాడు, కృష్ణుడు}; రాడు = వచ్చుటలేదు; తగవు = న్యాయము; మాలి = లేనివాడై; అనుచున్ = అని.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం  : :

No comments: