Thursday, December 11, 2014

రుక్మిణీకల్యాణం – పోఁడను బ్రాహ్మణుండు

49- వ.
అని వితర్కించుచు.
50- ఉ.
పోఁ ను బ్రాహ్మణుండు యదుపుంగవు వీటికి; వాసుదేవుఁడున్
రాఁ ను; నింకఁ బోయి హరి మ్మని చీరెడు నిష్టబంధుడున్
లేఁ ను; రుక్మికిం దగవు లేదటు చైద్యున కిత్తు నంచు ను
న్నాఁ ను; గౌరి కీశ్వరికి నావలనం గృపలేదు నే డనున్.
      రుక్మిణీదేవి అలా విచారిస్తూ, మాధవుని మథురకి బ్రాహ్మణుడు అసలు వెళ్ళే వెళ్ళి ఉండడు. వాసుదేవుడు ఇంక రాడు. పిలుచుకొచ్చే ప్రియ బాంధవుడు ఇంకొకడు లేడు. అన్న రుక్మికి అడ్డేం లేదు. శశిపాలుడికి ఇచ్చేస్తానంటున్నాడు. ఇవాళ పార్వతీదేవికి నామీద దయలేదు కాబోలు అని రకరకాలుగా మధనపడుతోంది.
49- va.
ani vitarkiMchuchu.
50- u.
pOM~ Danu braahmaNuMDu yadupuMgavu veeTiki; vaasudEvuM~Dun
raaM~ Danu; niMkaM~ bOyi hari rammani cheereDu niShTabaMdhuDun
lEM~ Danu; rukmikiM dagavu lEdaTu chaidyuna kittu naMchu nu
nnaaM~ Danu; gauri keeshvariki naavalanaM gRipalEdu nE Danun.
       అని = అని; వితర్కించుచున్ = తనలోతాను అనుకొనుచు.
       పోడు = వెళ్ళి ఉండడు; అనున్ = అనును; బ్రాహ్మణుండు = విప్రుడు; యదుపుంగవు = కృష్ణుని {యదుపుంగవుడు - యాదవ వంశస్తులలో శ్రేష్ఠుడు, కృష్ణుడు}; వీటి = నగరమున; కిన్ = కు; వాసుదేవుడున్ = కృష్ణుడు {వాసుదేవుడు - వసుదేవుని కొడుకు, కృష్ణుడు}; రాడు = వచ్చుటలేదు; ఇంకన్ = ఇంకను; పోయి = వెళ్ళి; హరిన్ = కృష్ణుని; రమ్ము = రావలసినది; అని = అని; చీరెడు = పిలిచెడు; ఇష్ట = ఆప్తుడైన; బంధుడున్ = మేలుకోరువాడు; లేడు = ఎవడు లేడు; అనున్ = అనును; రుక్మి = రుక్మి {రుక్మి - రుక్మిణి పెద్దన్న}; కిన్ = కి; తగవు = న్యాయము; లేదు = లేదు; అటు = అలా; చైద్యున్ = శిశుపాలుని; కిన్ = కి; ఇత్తున్ = ఇస్తాను; అంచున్ = అనుచు; ఉన్నాడు = ఎంచి ఉన్నాడు; అనున్ = అనును; గౌరి = పార్వతీదేవి {గౌరి - గౌరవర్ణము కలామె, పార్వతి}; కిన్ = కి; ఈశ్వరి = పరమేశ్వరి; కిన్ = కి; నా = నా; వలనన్ = ఎడల; కృప = దయ; లేదు = లేదు; నేడు = ఇవాళ; అనున్ = అనును.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం  : :

No comments: