Saturday, November 22, 2014

రుక్మిణీకల్యాణం – వ్రతముల్

29- మ.
వ్రముల్ దేవ గురు ద్విజన్మ బుధసేవల్ దానధర్మాదులున్
జన్మంబుల నీశ్వరున్ హరి జగత్కళ్యాణుఁ గాంక్షించి చే
సితి నేనిన్ వసుదేవనందనుఁడు నా చిత్తేశుఁ డౌఁ గాక ని
ర్జితు లై పోదురుగాక సంగరములోఁ జేదీశ ముఖ్యా ధముల్.
          రుక్మిణీదేవి అను నేను కనక గత జన్మలలో భగవంతుడు లోకకల్యాణుడు ఐన నారాయణుని కోరి వ్రతాలు చేసి ఉన్నట్లైతే, దేవతల గురువుల విప్రోత్తముల సేవ చేసి ఉన్నట్లైతే, దాన ధర్మాలు మొదలైనవి చేసి ఉన్నట్లైతే వసుదేవుని కొడుకైన కృష్ణుడు నాకు భర్త ఔగాక. యుద్ధంలో శశిపాలాది అధములు ఓడిపోవుదురు గాక.
29- ma.
vratamul dEva guru dvijanma budhasEval daanadharmaadulun
gatajanmaMbula neeshvarun hari jagatkaLyaaNuM~ gaaMkShiMchi chE
siti nEnin vasudEvanaMdanuM~Du naa chittEshuM~ DauM~ gaaka ni
rjitu lai pOdurugaaka saMgaramulOM~ jEdeesha mukhyaa dhamul.
          వ్రతముల్ = నోములు; దేవ = దేవతలను; గురు = పెద్దలను; ద్విజన్మ = విప్రులను; బుధ = ఙ్ఞానులను; సేవల్ = కొలచుటలు; దాన = దానము లిచ్చుటలు; ధర్మ = దర్మాచరణములు; ఆదులున్ = మున్నగువానిని; గత = పూర్వ; జన్మంబులన్ = జన్మములలో; ఈశ్వరున్ = సర్వము నేలువానిని; హరిన్ = విష్ణమూర్తిని; జగత్ = లోకమునకు; కల్యాణున్ = మేలుచేయువానిని; కాంక్షించి = కావాలని, కోరి; చేసితినేనిన్ = చేసినచో; వసుదేవనందనుడు = కృష్ణుడు {వసుదేవనందనుడు - వసుదేవుని కొడుకు, కృష్ణుడు}; నా = నా యొక్క; చిత్తేశుడు = భర్త {చిత్తేశుడు - మనసునకు ప్రభువు, భర్త}; ఔగాక = అగునుగాక; నిర్జితులు = ఓడిపోయినవారు; ఐపోదురుగాక = అయ్యెదరుగాక; సంగరము = యుద్దము; లోన్ = అందు; చేదీశ = శిశుపాలుడు {చేదీశుడు - చేది దేశపు ప్రభువు, శిశుపాలుడు}; ముఖ్య = మొదలగు; అధముల్ = నీచులు.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం  : :

No comments: