Saturday, August 23, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 390

తలగవు

8-28-క.
లఁగవు కొండలకైనను
లఁగవు సింగములకైన మార్కొను కడిమిం
లఁగవు పిడుగుల కైనను
ని బలసంపన్న వృత్తి నేనుఁగు గున్నల్.
          ఆ భూమిమీది ఏనుగు గున్నలు అమిత బలసంపన్నతతో ఎదిరించే శక్తి కలిగి ఉండటంతో, కొండలనైనా ఢీ కొట్టడానికి వెనుదీయవు, సింహాలనైనా సరే తప్పుకోకుండ ఎదిరించి నిలుస్తాయి, పిడుగుల నైనా లెక్కజేయక ముందడుగు వేస్తాయి.
గజేంద్ర మోక్షంలోని గజరాజు పరివారంలోని పిల్ల ఏనుగుల వర్ణన
8-28-ka.
tala@Mgavu koMDalakainanu
mala@Mgavu siMgamulakaina maarkonu kaDimiM
gala@Mgavu piDugula kainanu
nila balasaMpanna vRtti naenu@Mgu gunnal.
          తలగవు = తొలగిపోవు; కొండల్ = కొండల; కైనన్ = కి అయినను; మలగవు = తప్పుకొనవు; సింగముల్ = సింహముల; కైనన్ = కి అయినను; మార్కొనున్ = ఎదిరించు చుండును; కడిమిన్ = శౌర్యముతో; కలగవు = కలత చెందవు; పిడుగుల్ = పిడుగుల; కైనను = కి అయినను; ఇలన్ = భూమిపైన; బల = శక్తి; సంపన్న = సమృద్ధిగా నుండు; వృత్తిన్ = విధము యందు; ఏనుగు గున్నల్ = పిల్ల యేనుగులు.

~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: