Wednesday, July 16, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 353

నీ పాదకమల సేవయు

10.1-1272-క.
నీ పాదకమలసేవయు
నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాం
తాపార భూతదయయును
దాసమందార! నాకు యచేయఁ గదే.
          ఓ తపోధనులకు కల్పవృక్ష మైనవాడా! శ్రీకృష్ణా! కమలాల వంటి నీ పాదాల పరిచర్య, నీ పాదాలను పూజించే భక్తులతో మిత్రత్వం, ప్రాణులు అన్నిటిమీద అత్యంత అపరిమతమైన దయను నాకు ప్రసాదించు.
ద్వారకలో, శ్రేష్టమైన మాలలు ఇచ్చిన మాలలమ్మే సుదామునికి, శ్రీకృష్ణుడు వరంకోరుకో మని అనుగ్రహించాడు. ఆ సుదాముడు కోరిన వరం యిది. ఒక మాలాకారుని చేత యింతటి గంభీరమైన భావగర్భితమైన పలుకులు పలికించటంలో పోతనామాత్యుల వారి విశిష్ఠత కనబడుతోంది. వారు భక్తి పారవశ్యంతో మైమరచి పద్యాలలో యిలా మధుర మకరందాన్ని స్వచ్ఛమైన ప్రపత్తిని చిలకరిస్తుంటారు.
10.1-1272-ka.
nee paadakamalasEvayu
nee paadaarchakulatODi neyyamunu nitaaM
taapaara bhootadayayunu
daapasamaMdaara! naaku dayachEya@M gadE.
నీ = నీ యొక్క; పాద = పాదములు అనెడి; కమల = పద్మముల యందు; సేవయున్ = భక్తి; నీ = నీ యొక్క; పాద = పాదముల; అర్చకుల = భక్తుల; తోడి = తోటి; నెయ్యమును = స్నేహము; నితాంత = విస్తారమైన; అపార = అంతులేని; భూత = జీవుల యెడ; దయయును = దయకలిగి యుండుట; తాపసమందార = కృష్ణ {తాపసమందారుడు - తపస్సు చేయువారికి కల్పవృక్షము వంటివాడు, విష్ణువు}; నా = నా; కున్ = కు; దయచేయగదే = అనుగ్రహింపుము.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

6 comments:

TVRAAO said...

ఛందస్సు తో సహ మీ వివరణ బాగుంది. ధన్యవాదాలు.

TVRAAO said...
This comment has been removed by the author.
vsrao5- said...

ధన్యవాదాలు టివి రావుగారు మీ భాగవత అభిమానానికి.
ధన్యవాదాలు టివి రావుగారు మీ తెలుగు అభిమానానికి.

Sreenivasulu TN said...

Thank you so much sir

Unknown said...

Thank you sir

Rajamouli Nidumolu said...

*ద్వారకలో, శ్రేష్టమైన మాలలు ఇచ్చిన మాలలమ్మే సుదామునికి, శ్రీకృష్ణుడు వరంకోరుకో మని అనుగ్రహించాడు.*

- - - ద్వారక అని వ్రాశారు .
శ్రీకృష్ణ బలరాములు మధురానగరము చేరుకున్న తరువాత అక్కడ సుదాముని ఇంటికి వెళ్లారు . అప్పుడు జరిగిన అపూర్వ సంఘటన ఇది. 
నమస్కారం