Saturday, June 21, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 328

జలరాశి


1-52-క.
రాశి దాఁటఁ గోరెడి
ము జనుల్ కర్ణధారుఁ గాంచిన భంగిం
లి దోష హరణ వాంఛా
లితులమగు మేము నిన్నుఁ గంటిమి సూతా!
      ఓ సూతమహర్షీ! మహాసముద్రాన్ని దాటాలని ప్రయత్నించే ప్రయాణికులకు ఓడ నడిపే నావికుడు లభించినట్లుగా కలికాల కలుషాలను పోకార్చుకొని తరించాలనే కోరికతో నిరీక్షిస్తున్న మాకు నీవు కన్పించావు.
శౌనకాది మునీశ్వరులు భాగవతం చెప్పమని అడుగుతు సూత మహర్షిని ఇలా స్తుతించసాగారు.
1-52-ka.
jalaraaSi daa@MTa@M gOreDi
kalamu janul karNadhaaru@M gaaMchina bhaMgiM
gali dOsha haraNa vaaMChaa
kalitulamagu maemu ninnu@M gaMTimi sootaa!
          జలరాశిన్ = సముద్రము; దాఁటన్ = దాటుటను; కోరెడి = కోరే; కలము = ఓడలోని; జనుల్ = జనము; కర్ణధారున్ = చుక్కాని పట్టి నడిపే వానిని {కర్ణధారుడు - పడవ నడుపువాడు - తరింప సమర్థుడు}; కాంచిన = చూచినట్లు; భంగిన్ = వలె; కలి = కలికాలపు; దోష = పాపము; హరణ = నాశనము చేసే; వాంఛా = కోరికతో; కలితులము = కూడిన వారము; అగు = ఐనటువంటి; మేము = మేము; నిన్నున్ = నిన్ను {నిన్ను - కలి దోష నివారక సమర్థు డైనవాని}; కంటిమి = కనుగొన గలిగితిమి; సూతా = సూతా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: