Tuesday, June 3, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 306

మీ పాపడు


10.1-309-క.
మీ పాపఁడు మా గృహముల
నా పోవఁగఁ బాలు ద్రావ గపడ కున్నన్
గోపింపఁ బిన్నపడుచుల
వాపోవఁగఁ జిమ్ముకొనుచు చ్చెం దల్లీ!
          ఓ యమ్మా! మీ అబ్బాయికి మా యింట్లో తాగటానికి సరిపడగ పాలు కనబడలేదని కోపించి పసిపిల్లను పడదోసుకుంటూ బయటకు వస్తున్నాడు. పసిపిల్లలేమో గుక్కపెట్టి ఏడుస్తున్నారు. మరి నువ్వు ఓ బిడ్డకు తల్లివే కదా ఇదేమైనా బాగుందా చెప్పు.
ఆ కపట శైశవ కృష్ణమూర్తి దొంగజాడల జేయు బాల్యచేష్టలను గోపికలు ఓపికలు లేక యశోదాదేవికి చెప్పుకుంటున్నారు.
10.1-309-ka.
mee paapa@MDu maa gRhamula
naa pOva@Mga@M baalu draava nagapaDa kunnan
gOpiMpa@M binnapaDuchula
vaapOva@Mga@M jimmukonuchu vachcheM dallee!
          మీ = మీ యొక్క; పాపడు = పిల్లవాడు; మా = మా యొక్క; గృహములన్ = ఇండ్లలో; ఆపోవగన్ = సరిపడినంత; పాలు = పాలను; త్రావ = తాగుటకు; అగపడకన్ = కనబడకుండా; ఉన్నన్ = ఉండగా; కోపింపన్ = కోపించినచో; పిన్నపడపచులన్ = పసిబిడ్డలను; వాపోవగన్ = ఏడ్పించుచు; జిమ్ముకొనుచు = కాలితో ఎగజిమ్ముతో; వచ్చెన్ = వచ్చెను.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: