Monday, June 2, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 305

కట్టుము సేతువు

9-285-క.
ట్టుము సేతువు; లంకం
జుట్టుము; నీ బాణవహ్ని సురవైరి తలల్
గొట్టుము నేలంబడఁ; జే
ట్టుము నీ యబల నధిక భాగ్యప్రబలన్.
          ఓ రామ!  సేతువు కట్టుము. లంకను చుట్టుముట్టుము. నీ బాణాగ్నిచేత రావణాసురుని తలలు తరుగుము. మంగళకరంగా నీ యిల్లాలిని చేపట్టుము.
సముద్రుడు దారి విడువుమనిన అభ్యర్థన వినలేదని ఆగ్రహించి శ్రీరాముడు విల్లు ఎక్కుపెట్టగా. ఎదుటకు వచ్చి, సేతువు కట్టి దాటి వెళ్ళమని ఇలా మనవి చేసుకున్నాడు.
9-285-ka.
kaTTumu saetuvu; laMkaM
juTTumu; nee baaNavahni suravairi talal
goTTumu naelaMbaDa@M; jae
paTTumu nee yabala nadhika bhaagya prabalan.
          కట్టుము = నిర్మించుము; సేతువున్ = వంతెనను; లంకన్ = లంకా నగరమును; చుట్టుము = చుట్టుముట్టుము; నీ = నీ యొక్క; బాణ = బాణముల; వహ్నిన్ = అగ్నితో; సురవైరి = రావణుని {సురవైరి దేవతల శత్రువు, రావణుడు}; తలల్ = తలలను; కొట్టుము = పడగొట్టుము; నేలన్ = నేల మీద; పడన్ = పడిపోవు నట్లు; చేపట్టుము = స్వీకరించుము; నీ = నీ యొక్క; అబలన్ = స్త్రీని; అధిక = మిక్కిలి; భాగ్య = సౌభాగ్య; ప్రభలన్ = ప్రకాశములతో.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: