Friday, May 16, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 289

అపశబ్దంబుల

1-97-మ.
శబ్దంబులఁ గూడియున్ హరి చరిత్రాలాపముల్ సర్వపా
రిత్యాగము సేయుఁ గావున హరిన్ భావించుచుం బాడుచున్
ముల్ సేయుచు వీనులన్ వినుచు నశ్రాంతంబు గీర్తించుచుం
సుల్ సాధులు ధన్యులౌదురుగదా త్త్వజ్ఞ! చింతింపుమా.
          తత్త్వవిశారదా వ్యాస మునీంద్రా! పవిత్రమైన హరి చరిత్రలు కలిగిన కావ్యాలు అపశబ్దాలతో కూడుకొన్నప్పటికి సకల పాపాలను పటాపంచలు చేస్తాయి. అందువల్లనే సజ్జనులైన తపోధనులు శ్రీహరిని తలుస్తు, శ్రీహరి లీలలు గానం చేస్తు, ఆయన నామం జపం చేస్తు, ఆయన కథలు చెవులారా ఆలకిస్తు, ఎప్పుడూ ఆయననే కీర్తిస్తు తమ జన్మలు సార్థకం చేసుకొంటున్నారు.
నారమహర్షులు వ్యాసమహర్షిని భాగవత రచన చేయమని ఉద్భోదిస్తున్న సందర్భంలో ఇలా చెప్పారు,
1-97-ma.
apaSabdaMbula@M gooDiyun hari charitraalaapamul sarvapaa
pa parityaagamu saeyu@M gaavuna harin bhaaviMchuchuM baaDuchun
japamul saeyuchu veenulan vinuchu naSraaMtaMbu geertiMchuchuM
dapasul saadhulu dhanyulaudurugadaa tattvaj~na! chiMtiMpumaa.
          అపశబ్దంబులన్ = తుచ్చమైనమాటలతో; కూడియున్ = కలిసియున్నప్పటికి; హరి = శ్రీహరి; చరిత్ర = చారిత్రముల; ఆలాపముల్ = పలుకులు; సర్వ = సమస్త; పాప = పాపములను; పరిత్యాగమున్ = పూర్తిగ విడిచిపోవుటను; చేయున్ = చేయును; కావున = అందువలన; హరిన్ = హరిని; భావించుచున్ = ధ్యానము చేయుచు; పాడుచున్ = (లీలలు) గానము చేయుచు; జపముల్ = జపాలు; చేయుచున్ = చేయుచు; వీనులన్ = చెవులారా; వినుచున్ = వినుచు; అశ్రాంతంబు = ఎడతెగకుండగ; కీర్తించుచున్ = కీర్తించుచు; తపసుల్ = తాపసులు; సాధులు = మంచివారు; ధన్యులు = సార్థకులు; ఔదురు = ఔతారు; కదా = కదా; తత్త్వజ్ఞ = తత్త్వజ్ఞానము గలవాడా; చింతింపుమా = ఆలోచించు కొనుము.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: