Saturday, April 26, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 270

వరచేలంబులొ


8-550-మ.

చేలంబులొ మాడలో ఫలములో న్యంబులో గోవులో
రులో రత్నములో రథంబులొ విమృష్టాన్నంబులో కన్యలో
రులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో
ణీ ఖండమొ కాక యే మడిగెదో ధాత్రీసురేంద్రోత్తమా!
          ఓ బ్రాహ్మణోత్తముడా! నీకేం కావాలో కోరుకో. మేలైన వస్త్రములా, డబ్బులా, పండ్లా, అడవి సంపదలా, గోవులా, గుర్రాలా, రత్నాలా, రథాలా, మంచి ఆహారాలా, కన్యలా, ఏనుగులా, బంగారమా, భవనాలా, గ్రామాలా, పొలాలా, భూభాగాలా లేకపోతే ఇవి కాకుండా ఇంకేమైనా కోరుకుంటున్నావా?
 అంటు బలిచక్రవర్తి తనను అడగటానికి వచ్చిన వామనుని అడుగుతున్నాడు.
8-550-ma.
varachaelaMbulo maaDalO phalamulO vanyaMbulO gOvulO
harulO ratnamulO rathaMbulO vimRshTaannaMbulO kanyalO
karulO kaaMchanamO nikaetanamulO graamaMbulO bhoomulO
dharaNee khaMDamo kaaka yae maDigedO dhaatreesuraeMdrOttamaa!
          వర = మంచి; చేలంబులో = బట్టలు కాని; మాడలో = సువర్ణ నాణెములు కాని {మాడ – అర వరహా, ఒక సువర్ణనాణెము}; ఫలములో = పళ్ళు కాని; వన్యంబులో = వనములు కాని; గోవులో = పశువులు కాని; హరులో = గుర్రములు కాని; రత్నములో = మణులు కాని; రథంబులో = రథములు కాని; విమృష్టాన్నంబులో = మంచి ఆహారములు కాని; కన్యలో = స్త్రీలు కాని; కరులు = ఏనుగులు కాని; కాంచనమో = బంగారము కాని; నికేతనములో = ఇళ్ళు కాని; గ్రామంబులో = ఊళ్ళు కాని; భూములో = పొలములు కాని; ధరణీఖండమో = భూభాగము కాని; కాక = కాకపోతే; ఏమి = ఏది; అడిగెదో = అడిగెదవు; ధాత్రీసుర = బ్రాహ్మణ; ఇంద్ర = శ్రేష్ఠులలో; ఉత్తమా = ఉత్తముడా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: