Monday, April 14, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 258

క్రమమున

4-503-క.

క్రమున నిటు పృథ్వాదులు
తమ కామితము లనఁగఁ గు భిన్న క్షీ
ము దోహన వత్సక భే
మునం దగఁ బిదికి; రంత రణీధవుఁడున్.
          ఆ ప్రకారంగా క్రమక్రమంగా పృథువు మొదలైనవారు వేరువేరు వత్సములను, పాత్రలను కల్పించుకొని తమతమ కోర్కెలనే వేరువేరు క్షీరాలను పిదుకుకున్నారు. అలా ఆ రాజు కూడ సముచితానందము పొందెను.
4-503-ka.
kramamuna niTu pRthvaadulu
damatama kaamitamu lana@Mga@M dagu bhinna kshee
ramu dOhana vatsaka bhae
damunaM daga@M bidiki; raMta dharaNeedhavu@MDun.
          క్రమమునన్ = వరుసగా; ఇటు = ఇలా; పృథు = పృథుచక్రవర్తి; ఆదులు = మొదలగువారు; తమతమ = తమతమ; కామితంబులు = కోరికలు; అనన్ = అనుటకు; తగిన = తగినట్టి; భిన్న = రకరకముల; క్షీరమున్ = పాలను; దోహన = పితికెడిపాత్రలు; వత్సక = దూడలు యొక్క; భేదమున్ = భేదము; అందగన్ = పొందునట్లుగ; పిదికిరి = పితికిరి; అంతన్ = అంతట; ధరణీధవుడున్ = రాజుకూడ {ధరణీధవుడు - ధరణి (భూమికి) ధవుడు (భర్త), రాజు}.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: