Friday, March 7, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 220

కంజాక్షునకుగాని

7-170-సీ.
కంజాక్షునకుఁ గాని కాయంబు కాయమే?
 వన కుంఫిత చర్మస్త్రి గాక;
వైకుంఠుఁ బొగడని క్త్రంబు వక్త్రమే?
 మఢమ ధ్వని తోడి క్క గాక;
రిపూజనము లేని స్తంబు హస్తమే?
 రుశాఖ నిర్మిత ర్వి గాక?
మలేశుఁ జూడని న్నులు కన్నులే?
 నుకుడ్య జాలరంధ్రములు గాక;
ఆ. క్రిచింత లేని న్మంబు జన్మమే?
రళ సలిల బుద్బుదంబు గాక;
విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుఁడే?
పాద యుగము తోడి శువు గాక.
          గురువుల దగ్గరకి పంపాను కదా, నువ్వేం నేర్చుకున్నావో చెప్పమని తండ్రి హిరణ్యాక్షుడు అడిగాడు. పిల్లాడు ప్రహ్లాదుడు చేతులు, కాళ్ళు, కళ్ళు కదుపతు తను తెలుసుకున్న నిజమైన జ్ఞానం ఏమిటో చెప్తున్నాడు:
తండ్రీ! విష్ణు సేవకు పనికిరానట్టి శరీరం శరీరంకాదు, అది గాలికొట్టే వట్టి తోలుతిత్తి. నారాయణుని కీర్తించని నోరు నోరు కాదు, అది ఢమఢమ అని శబ్దం చేసే ఢక్కా అనే వాయిద్యం. లక్ష్మీపతిని పూజించని చెయ్యి చెయ్యి కాదు, అది కర్రతో చేసిన తెడ్డు. శ్రీహరిని చూడని కన్నులు కన్నులు కాదు, అవి శరీర మనే గోడకి ఉన్న కిటికీలు. విష్ణుధ్యానం ఎరుగని జన్మ జన్మ కాదు, అది కదులుతుండే నీటిబుడగ. హరిభక్తి లేకపోతే ఎంతటి పండితుడు అయినా పండితుడు కాదు, వాడు రెండుకాళ్ళ దున్నపోతు.
7-170-see.
kaMjaakshunaku@M gaani kaayaMbu kaayamae?
 pavana kuMphita charmabhastri gaaka;
vaikuMThu@M bogaDani vaktraMbu vaktramae?
 DhamaDhama dhvani tODi Dhakka gaaka;
haripoojanamu laeni hastaMbu hastamae?
 taruSaakha nirmita darvi gaaka?
kamalaeSu@M jooDani kannulu kannulae?
 tanukuDya jaalaraMdhramulu gaaka;
aa. chakrichiMta laeni janmaMbu janmamae?
taraLa salila budbudaMbu gaaka;
vishNubhakti laeni vibudhuMDu vibudhu@MDae?
paada yugamu tODi paSuvu gaaka.
          కంజాక్షున్ = నారాయణుని {కంజాక్షుడు - కంజము (కమలము)ల బోలు అక్షుడు (కన్నులు గలవాడు), విష్ణువు}; కున్ = కి; కాని = ఉపయోగించని; కాయంబు = దేహము; కాయమే = దేహమా ఏమి; పవన = గాలి; గుంఫిత = నింపబడి నట్టి; చర్మభస్త్రి = తోలుతిత్తి {తోలు తిత్తి – కమ్మరి పనిలో పొయ్యి/కొలిమికి గాలి కొట్టడానికి జంతు చర్మతో చేసిన సాధనం, ఇది బయటనుండి గాలి పీల్చుకొని కొలిమిలోకి విడుస్తూ ఉంటుంది}; కాక = కాకుండగ; వైకుంఠున్ = నారాయణుని {వైకుంఠుడు – వైకుంఠమున నుండు వాడు, విష్ణువు}; పొగడని = కీర్తించని; వక్త్రంబున్ = నోరు; వక్త్రమే = నోరా ఏమి; ఢమఢమ = ఢమఢమ యనెడి; ధ్వని = శబ్దముల; తోడి = తోకూడిన; ఢక్క = ఢంకా; కాక = కాకుండగ; హరి = నారాయణుని; పూజనమున్ = పూజలను చేయుట; లేని = లేని; హస్తంబు = చేయి; హస్తమే = చేయేనా ఏమి; తరు = చెట్టు; శాఖ = కొమ్మచే; నిర్మిత = చేయబడిన; దర్వి = తెడ్డు, గరిటె; కాక = కాకుండగ; కమలేశున్ = నారాయణుని {కమలేశుడు - కమల (లక్ష్మీదేవి) యొక్క ఈశుడు (భర్త), విష్ణువు}; చూడని = చూడనట్టి; కన్నులు = కళ్లు; కన్నులే = కళ్లేనా ఏమి; తను = దేహము యనెడి; కుడ్య = గోడ యందలి; జాలరంధ్రములు = కిటికీలు; కాక = కాకుండగ; చక్రి = నారాయణుని {చక్రి – చక్రాయుధము గలవాడు, విష్ణువు}; చింత = తలపు, ధ్యానము; లేని = లేనట్టి; జన్మంబు = పుట్టుక కూడ; జన్మమే = పుట్టుక యేనా ఏమి; తరళ = కదలుచున్న; సలిల = నీటి; బుద్భుదంబు = బుడగ; కాక = కాకుండగ; విష్ణుభక్తి = విష్ణుభక్తి; లేని = లేనట్టి; విబుధుండు = విద్వాంసుడు; విబుధుండే = విద్వాంసుడా ఏమి; పాద = కాళ్ళు; యుగము = రెంటి; తోడి = తోటి; పశువు = పశువు; కాక = కాకుండగ.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: