Monday, January 6, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 163

unnaaramu

1-251-క.
న్నారము సౌఖ్యంబున
విన్నారము నీ ప్రతాప విక్రమ కథలన్
న్నారము ధనికులమై
న్నారము తావకాంఘ్రిమలములు హరీ!

          చాలా రోజుల తరువాత శ్రీకృష్ణుడు పాండవులకు విజయం చేకూర్చి, ధర్మరాజుకు పట్టాభిషేకం చేయించి, తన నగరానికి తిరిగి వచ్చాడు. ఈ సందర్భంలో ద్వారకావాసులు ఆనందంతో పలకరిస్తున్నారు.
కృష్ణయ్య! నీ దయవల్ల మేమంతా సుఖంగా ఉన్నాం. నీ శౌర్యప్రతాపాల గురించిన విశేషాలు వింటున్నాం, సంతోషిస్తున్నాం. మాకు ఇన్నాళ్ళకి మళ్ళా నీ పాదపద్మాల దర్శనం అయింది. భాగ్యవంతులమై విలసిల్లుతున్నాం.

1-251-ka.
unnaaramu saukhyaMbuna
vinnaaramu nee prataapa vikramakathalan
mannaaramu dhanikulamai
kannaaramu taavakaaMghrikamalamulu haree!

          ఉన్నారము = ఉన్నాము; సౌఖ్యంబునన్ = సుఖంగ; విన్నారము = విన్నాము; నీ = నీ యొక్క; ప్రతాప = శౌర్యము; విక్రమ = పరాక్రమముల యొక్క; కథలన్ = కథలు; మన్నారము = మంటిమి / బ్రతికుతున్నాము; ధనికులము = ధనవంతులము; = అయ్యి; కన్నారము = కంటిమి / చూచితిమి; తావక = నీయొక్క; అంఘ్రి = పాద; కమలములు = పద్మములు; హరీ = కృష్ణా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: