Thursday, October 31, 2013

తెలుగు భాగవత తేనె సోనలు – 102



dharaNiduhitRraMtaa

11-126-మా.
ణిదుహితృరంతా! ర్మమార్గానుగంతా!
నిరుపమనయవంతా! నిర్జరారాతిహంతా!
గురుబుధసుఖకర్తా! కోసలక్షోణిభర్తా!
సుభయపరిహర్తా! సూరిచేతోవిహర్తా!
11-126-maa.
dharaNiduhitRraMtaa! dharmamaargaanugaMtaa!
nirupamanayavaMtaa! nirjaraaraatihaMtaa!
gurubudhasukhakartaa! kOsalakshONibhartaa!
surabhayaparihartaa! soorichaetOvihartaa!
          భూదేవి పుత్రిక యైన సీతాదేవిని ఆనందింప జేయు వాడా! ధర్మమార్గాన్ని సదా అనుసరించిన వాడా! సాటిలేని నీతిమంతుడా! దేవతల శత్రువు లైన రాక్షసులను సంహరించిన వాడా! కోసల దేశ రాజ! దేవతల భయమును పోగొట్టిన వాడ! పండితుల హృదయాలలో విహరించు వాడ! శ్రీరామ! – ఇది ఏకాదశ స్కంధాంత ప్రార్థనా పద్యం. పోతన కృత స్కంధాలు తొమ్మిది (దశమ రెండు భాగాలు విడిగా గణించి) మరియు నారయల కృత స్కందాలు రెంటి స్కంధాంత ప్రార్థనలలో ఒక్కొక్క మాలిని వృత్తం ఉన్నాయి. బొప్పన కృత పంచమ స్కంధ పూర్వాశ్వాసాంత ప్రార్థనలో మాలిని వాడి, ద్వితీయాశ్వాసాంత ప్రార్థనలో మాలిని బదులు మత్తకోకిల వాడబడింది. ఏర్చూరి సింగన కృత షష్ఠస్కంధాంత ప్రార్థనలో మాలిని బదులు తోటకము ప్రయోగించ బడింది. ఈ విధంగా తెలుగు భాగవతము మొత్తంలో పన్నెండు (12) మాలిని వృత్తాలు స్కంధాంత ప్రార్థనలలో వాడబడింది.
          ధరణి దుహితృ రంతా = శ్రీరామా {ధరణి దుహితృ రంత – ధరణి దుహితృ (భూదేవి పుత్రికతో) రంత (క్రీడించు వాడు), రాముడు}; ధర్మమా ర్గానుగంతా = శ్రీరామా {ధర్మమా ర్గానుగంత - ధర్మమార్గమును అనుగంత (అనుసరించు వాడు), రాముడు}; నిరుపమ నయవంతా = శ్రీరామా {నిరుపమ నయవంత - నిరుపమ (సాటిలేని) నయవంత (నీతి కల వాడు), రాముడు}; నిర్జ రారాతి హంతా = శ్రీరామా {నిర్జ రారాతి హంత - నిర్జర అరాతి (రాక్షసులను) హంత (సంహరించిన వాడు), రాముడు}; గురు బుధ సుఖ కర్తా = శ్రీరామా {గురు బుధ సుఖ కర్త - గురువులకు బుధ (పండితులకు) సుఖమును కర్త (కలిగించు వాడు), రాముడు}; కోసల క్షోణి భర్తా = శ్రీరామా {కోసల క్షోణి భర్త - కోసల అనెడి క్షోణి (రాజ్యాని)కి భర్త (రాజు), రాముడు}; సుర భయ పరిహర్తా = శ్రీరామా {సుర భయ పరిహర్త -సుర (దేవతల) భయమును పరిహర్త (పోగొట్టు వాడు), రాముడు}; సూరి చేతో విహర్తా = శ్రీరామా {సూరి చేతో విహర్త - సూరి (పండితుల) చేతస్ (హృదయాల)లో విహర్త (విహరించే వాడు), రాముడు}.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Wednesday, October 30, 2013

తెలుగు భాగవత తేనె సోనలు – 101



sirikiM jeppa@MDu

8-96-మ.
సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే
రివారంబునుఁ జీరఁ డభ్రగపతిం న్నింపఁ డాకర్ణికాం
ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివా ప్రోత్థిత శ్రీ కుచో
రిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై.
8-96-ma.
sirikiM jeppa@MDu; SaMkha chakra yugamuM jaedOyi saMdhiMpa@M; Dae
parivaaraMbunu@M jeera@M 'DabhragapatiM banniMpa@M' DaakarNikaaM
tara dhammillamu@M jakka notta@MDu; vivaada prOtthita Sree kuchO
parichaelaaMchalamaina veeDa@MDu gajapraaNaavanOtsaahiyai. 
        గజేంద్రుని ప్రాణాలు కాపాడలనే ఉత్సాహంతో నిండిపోయిన విష్ణుమూర్తి లక్ష్మీదేవికీ చెప్పలేదు; శంఖచక్రాలను రెండు చేతుల్లోకీ తీసుకోలేదు; సేవకుల నెవరినీ పిలువలేదు; గరుడవాహనాన్నీ సిద్దపరచకోలేదు; చెవి దుద్దు వరకు జారిన జుట్టూ చక్కదిద్దుకోలేదు; ప్రణయ కలహంలో ఎత్తిపట్టిన లక్ష్మీదేవి కొం గైనా వదల్లేదు. 
          సిరి = లక్ష్మీదేవి; కిన్ = కైనను; చెప్పడు = చెప్ప లేదు; శంఖ = శంఖము; చక్ర = సుదర్శన చక్రము; యుగమున్ = జంటను; చేదోయి = చేతులు రెంటి యందు; సంధింపడు = ధరించుట లేదు; = ; పరివారంబునున్ = సేవకులను; చీరడు = పిలువ లేదు; అభ్రగపతిన్ = గరుత్మంతుని {అభ్రగపతి - అభ్రగముల (గగనచరు లైన పక్షులకు) పతి (ప్రభువు), గరుడుడు}; పన్నింపడు = సిద్ధపరుప నియమించడు; ఆకర్ణిక = చెవి దుద్దుల; అంతర = వరకు జారినట్టి; ధమిల్లమున్ = జుట్టు ముడిని; చక్కనొత్తడు = చక్కదిద్ధుకొనుట లేదు; వివాద = ప్రణయకలహము నందు; ప్రోత్థిత = పైకిలేపిన; శ్రీ = లక్ష్మీదేవి యొక్క; కుచ = వక్షము; ఉపరి = మీది; చేలాంచలము = చీర కొంగు; ఐనన్ = అయినను; వీడడు = వదలిపెట్టుట లేదు; గజ = గజేంద్రుని; ప్రాణ = ప్రాణాలను; ఆవన = కాపాడెడి; ఉత్సాహి = ఉత్సాహము కలవాడు; = అయ్యి
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Tuesday, October 29, 2013

తెలుగు భాగవత తేనె సోనలు – 100



diTacheDi

3-698-క.
దిచెడి లోఁబడె దైత్యుఁడు
టికిన్ దంష్ట్రా విభిన్న త్రు మహోర
స్తటికిన్ ఖరఖురపుటికిం
టి తట హత కమలజాండ టికిం గిటికిన్.
          అలా సముద్ర గర్భంలో జరుగుతున్నపోరాటంలో – పటుత్వాలు జారిపోయిన ఆ దితి కశ్యపుల కొడుకు హిరణ్యాక్షుడు లొంగిపోయాడు. అతనికి ఆ ఆదివరాహ స్వామి మెడమీద వేళ్ళాడే జూలుతో, దుండగుల గుండెలు బద్దలుకొట్టే కోరలుతో, వాడి గిట్టలుతో, బ్రహ్మాం భాండాన్ని పెటపెటలాడించే కటిప్రదేశంతో అతి భీకరంగా కనిపించాడు.
3-698-ka.
diTacheDi lO@MbaDe daityu@MDu
saTikin daMshTraa vibhinna Satru mahOra
staTikin kharakhurapuTikiM
gaTi taTa hata kamalajaaMDa ghaTikiM giTikin.
               దిట = పటుత్వము; చెడి = తప్పిపోయి; లోబడెన్ = లొంగెను; దైత్యుడు = హిరణ్యాక్షుడు {దైత్యుడు - దితి యొక్క పుత్రుడు, హిరణ్యాక్షుడు}; సటి = వర హావతారుని {సటి – జూలు కలది, అడవిపంది}; కిన్ = కి; దంష్ట్రా విభిన్న శత్రు మహోరస్తటి = వరహావతారుని {దంష్ట్రా విభిన్న శత్రు మహోరస్తటి - దంష్ట్రా (కోరలచే) విభిన్న (బద్ధలు కొట్టబడిన) శత్రువు యొక్క మహా (గొప్ప) ఉరస్తటి (వక్షస్థలము కలది), ఆదివరాహము}; కిన్ = కి; ఖర ఖుర పుటి = వరహావతారుని {ఖర ఖుర పుటి - ఖర (వాడి) యైన ఖుర (గిట్టలు) యొక్క పుటి (నేర్పు గల నడక కలది), ఆదివరాహము}; కిన్ = కి; కటితట హత కమలజాండ ఘటి = వరహావతారుని {కటితట హత కమలజాండ ఘటి - కటి (మొల) తట (భాగమున) హత (కట్టబడిన) కమలజాండ (బ్రహ్మాండము అను) ఘటి (భాండము కలది), ఆదివరాహము}; కిన్ = కి {కమలజాండము - కమల (పద్మము)న జ (పుట్టిన వాడు) (బ్రహ్మ) అండము, బ్రహ్మాండము}; కిటి = వరహావతారుని; కిన్ = కి;
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~