Tuesday, December 3, 2013

తెలుగు భాగవత తేనె సోనలు – 130



puTTipuTTa@MDu

10.1-310-మత్త.
పుట్టిపుట్టఁడు నేడు దొంగిలఁ బోయి మా యిలు జొచ్చి తా
నుట్టి యందక ఱోలు పీఁటలు నొక్క ప్రోవిడి యెక్కి చై
పెట్టఁ జాలక కుండ క్రిం దొక పెద్ద తూఁ టొనరించి మీ
ట్టి మీఁగడపాలు చేరలఁ ట్టి త్రావెఁ దలోదరీ!
          కృష్ణుడి అల్లరికి గోపికలు ఓపికలు లేక యశోదమ్మతో చెప్తున్నారు. –  సన్నకడుపు సుందరీ! యశోదా! మీ వాడు మొన్నే కదా పుట్టాడు. అప్పుడే చూడు దొంగతనాలు మొదలెట్టేసాడు. మా యింట్లో దూరాడు. ఉట్టిమీది పాలు పెరుగు అందలేదట. రోళ్ళు, పీటలు ఒకదానిమీద ఇంకోటి ఎక్కించాడు. వాటిమీదకి ఎక్కినా చెయ్యి పెడదామంటే అందలేదట. అందుకని కుండ కింద పెద్ద చిల్లు పెట్టాడు. కారుతున్న మీగడపాలు దోసిళ్ళతో పట్టుకొని కడుపు నిండా తాగేసాడు.
10.1-310-matta.
puTTipuTTa@MDu naeDu doMgila@M bOyi maa yilu jochchi taa
nuTTi yaMdaka ~rOlu pee@MTalu nokka prOviDi yekki chai
peTTa@M jaalaka kuMDa kriM doka pedda too@M TonariMchi mee
paTTi mee@MgaDapaalu chaerala@M baTTi traave@M dalOdaree!
          పుట్టిపుట్టడు = మొన్నమొన్నే పుట్టాడు; నేడు = ఇవాళ; దొంగిల బోయి = దొంగిలించుటకు వెళ్ళి; మా = మా యొక్క; యిల్లున్ = నివాసమును; చొచ్చి = ప్రవేశించి; తాన్ = అతను; ఉట్టి = ఉట్టి {ఉట్టి పాలు పెరుగు లాంటివి పిల్లులకు అందకుండుటకై పైన వేళ్ళాడదీసెడి తాళ్ళ సాధనము}; అందక = అందకపోవుటచే; ఒక = ఒక; ఱోలున్ = రోటిని {రోలు - ధాన్యాదులను దంచుటకైన గుండ్రటి సాధనము}; పీటలు = పీటలు; ఒక్క = ఒక; ప్రోవు = పోగులా; ఇడి = పెట్టి; యెక్కి = పైకెక్కి; చై = చెయ్యి; పెట్టన్ = పెట్టుటకు; చాలకన్ = అందకపోవుటచేత; కుండ = కుండకు; క్రిందన్ = కింద పక్కని; ఒక = ఒకానొక; పెద్ద = పెద్ద; తూటు = కన్నము; ఒనరించి = చేసి; మీ = మీ యొక్క; పట్టి = పిల్లవాడు; మీగడపాలు = మీగడకట్టిన పాలను; చేరలన్ = దోసిళ్ళతో; పట్టి = పట్టుకొని; త్రావెన్ = తాగెను {దోసిళ్ళతో తాగడ మంటే చాలా ఎక్కువగా తాగడం}; తలోదరీ = సుందరీ {తలోదరి - తల (పలుచ)నైన ఉదరము కలది, స్త్రీ}.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: