Saturday, November 16, 2013

తెలుగు భాగవత తేనె సోనలు – 115

chaebaMti

10.1-316-క.
చేబంతి తప్పి పడెనని
ప్రాల్యముతోడ వచ్చి వనము వెనుకన్
మా బిడ్డ జలక మాడఁగ
నీ బిడ్డఁడు వలువఁ దెచ్చె నెలఁతుక! తగునే?
          గోపికలు కృష్ణుని అల్లరి చూసి ఓపికలులేక అతని తల్లికి చెప్పుకుంటున్నారు -  ఓ యింతి! తన చేతి ఆట బంతి ఎగిరివచ్చి పడిందని దబాయింపుగా మా పెరట్లోకి వచ్చేసాడు. అప్పుడు మా అమ్మాయి స్నానం చేస్తోంది. మీ అబ్బాయి చీర తీసుకొని పారిపోయాడు, ఇదేమైనా బావుందా చెప్పమ్మా యశోదా!
10.1-316-ka.
chaebaMti tappi paDenani
praabalyamutODa vachchi bhavanamu venukan
maa biDDa jalaka maaDa@Mga
nee biDDa@MDu valuva@M dechche nela@Mtuka! tagunae?
          చేబంతి = చేబంతి, ఆడెడి బంతి; తప్పి = తప్పిపోయి; పడెను = పడిపోయినది; అని = అని; ప్రాబల్యము = దబాయించుట; తోడన్ = తోటి; వచ్చి = వచ్చి; భవనము = మేడ; వెనుకన్ = వెనుక, పెరడులో; మా = మా యొక్క; బిడ్డ = ఆడపిల్ల; జలకమాడగన్ = స్నానము చేయుచుండగా; నీ = నీ యొక్క; బిడ్డడు = పిల్లవాడు; వలువ = గుడ్డ; తెచ్చెన్ = తీసుకొచ్చేసెను; నెలతుక = ఇంతి; తగునే = ఇది యుక్తమైనదేనా, కాదు.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: