Saturday, November 9, 2013

తెలుగు భాగవత తేనె సోనలు – 112



SreekaaMtaa

5.2-1-క.
శ్రీకాంతాహృదయప్రియ!
లోకాలోకప్రచార! లోకేశ్వర! సు
శ్లో! భవభయనివారక!
గోకులమందార! నందగోపకుమారా!
          శ్రీకృష్ణా! లక్ష్మీదేవి మనసు మెప్పు పొందిన వాడ ! ఈ సృష్టి అస్తిత్వ, అభావాలు రెంటి యందు సంచరించు వాడ! సర్వ లోకాలకు ప్రభు వైన వాడ! మంచి యశస్సు గల వాడా! సంసార తాపాలను తొలగించువాడ! ఉత్తములచే కీర్తింపబడు వాడా! గోకులంలోని వారందరకి కల్పవృక్షం అయిన వాడ! గొల్ల వంశపు నందుని పుత్రుడా! అవధరింపుము ఈ మహాబాగవత మందలి పంచమ స్కంధపు ద్వితీయాశ్వాసమును. – ఈ స్కంధం గంగనార్యుల వారి కృతి. పోతన సంప్రదాయాన్ని అనుసరిస్తు చేసిన ఈ ద్వితీయాశ్వాస ప్రారంభ స్తోత్రంలో లోకాలోకప్రచార అనటంతో సందర్భ సార్థక్యం పాటించబడింది. అలా లోకాలను, అలోకాలను, లోకాలోక పర్వతాన్ని వివరించబడుతా యని సూచింపబడింది.
5.2-1-ka.
SreekaaMtaahRdayapriya!
lOkaalOkaprachaara! lOkaeSvara! su
SlOka! bhavabhayanivaaraka!
gOkulamaMdaara! naMdagOpakumaaraa!
          శ్రీకాంతా హృదయ ప్రియ = శ్రీకృష్ణా {శ్రీకాంతా హృదయ ప్రియ - శ్రీకాంత (లక్ష్మీదేవి) యొక్క హృదయమునకు ప్రియ (ప్రియ మైన వాడు), విష్ణువు}; లోకాలోక ప్రచార = శ్రీకృష్ణా {లోకాలోక ప్రచార - లోక (లోకము లందును) అలోక (లోకములు లేనప్పుడును) ప్ర (చక్కగా) చార (వర్తించెడి వాడు), లోకాలోక పర్వతము వరకు ప్రచారము గల వాడు, విష్ణువు}; లోకేశ్వర = శ్రీకృష్ణా {లోకేశ్వరుడు లోకము లన్నిటికిని ఈశ్వరుడు, విష్ణువు}; సుశ్లోక = శ్రీకృష్ణా {సుశ్లోక - సు (గొప్ప) చేత శ్లోక (యశస్సు గల వాడు), విష్ణువు}; భవ భయ నివారక = శ్రీకృష్ణా {భవ భయ నివారకుడు - భవ (సంసారము) వలని భయ (భయమును) నివారకుడు (పోగొట్టు వాడు), విష్ణువు}; గోకుల మందార = శ్రీకృష్ణా {గోకుల మందార - గోకులమునకు మందార (కల్పవృక్షము వంటి వాడు), కృష్ణుడు}; నందగోప కుమారా = శ్రీకృష్ణా {నందగోప కుమారుడు - నందగోపుని యొక్క కుమారుడు, కృష్ణుడు};
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: